ఈ సారి వాళ్లను టార్గెట్ చేయనున్న వైష్ణవ్: మూడో సినిమాను అలా ప్లాన్ చేశాడట
తెలుగు సినీ ఇండస్ట్రీలోనే మెగా ఫ్యామిలీది ప్రత్యేకమైన స్థానం. దీనికి కారణం ఆ కుటుంబం నుంచి దాదాపు పది మంది వరకూ హీరోలుగా పరిచయం అవ్వడమే. అంతేకాదు, వాళ్లలో చాలా మంది స్టార్లుగా వెలుగొందుతున్నారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి.. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు పంజా వైష్ణవ్ తేజ్. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడైన ఇతడు.. 'ఉప్పెన'తో గ్రాండ్‌గా లాంచ్ అయ్యాడు. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం రూ. 50 కోట్లు కలెక్ట్ చేసి టాలీవుడ్ హిస్టరీలో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది.
మొదటి సినిమా విడుదల కాకముందే తన రెండో చిత్రాన్ని పూర్తి చేసుకున్నాడు వైష్ణవ్ తేజ్. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రూపొందించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఈ మెగా హీరో తన మూడో సినిమాను కూడా మొదలెట్టేశాడు. 'అర్జున్ రెడ్డి'ని తమళంలో రీమేక్ చేసిన దర్శకుడు గిరిషయ్య దీన్ని రూపొందించనున్నాడు. సీనియర్ ప్రొడ్యూసర్ బీవీఎస్ఎస్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఢిల్లీ ఇన్‌స్టాగ్రామ్ సెన్సేషన్ కేతిక శర్మ హీరోయిన్‌గా చేస్తుంది.

మొదటి సినిమా 'ఉప్పెన'తో యూత్‌లో మాంచి ఫాలోయింగ్‌ను పెంచుకున్న వైష్ణవ్ తేజ్.. ఈ చిత్రంతో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్ చేయబోతున్నాడట. 'కొండపొలం' అనే నవల ఆధారంగా ఈ సినిమా రూపొందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫుల్ ఎమోషన్స్‌తో సాగే ఈ సినిమా పల్లెటూరి వాతావరణంలో రూపొందనుందని తెలుస్తోంది. అంతేకాదు, దీనికి 'జంగిల్ బుక్' అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా, ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం జరిగింది. దీనికి చిత్ర యూనిట్‌తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా హాజరయ్యాడు.


Click it and Unblock the Notifications











