వైష్ణవ్ తేజ్ మరో రొమాంటిక్ సినిమా... ఘాటైన రోల్ కోసం బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన వారిలో వైష్ణవ్ తేజ్ ఒకరు. ఈ మెగా మేనల్లుడు మొత్తానికి మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసుకున్నాడు. నెవర్ బిఫోర్ అనేలా బెస్ట్ డెబ్యూ హీరోగా ఒక సంచలనం క్రియేట్ చేశాడు. ఎవరు కూడా ఎంట్రీ లోనే ఇలాంటి కలెక్షన్స్ ను అందుకోలేదు. ఇక ఉప్పెన సినిమా తర్వాత అదే తరహాలో విజయాన్ని అందుకోవాలని చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. అయితే అతను సెలెక్ట్ చేసుకుంటున్న సినిమాలు ఎంత వరకు సక్సెస్ అవుతాయో తెలియదు గాని వైష్ణవ్ మాత్రం కాస్త భిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు.

ఉప్పెన సినిమా అనంతరం అతనికి ఒకేసారి పదికి పైగా ఆఫర్స్ వచ్చాయి. చాలా మంది నిర్మాతలు కూడా అడ్వాన్స్ ఇవ్వడానికి అతని ముందుకు వచ్చారు. కానీ వైష్ణవ్ తేజ్ మాత్రం కొంచెం కూడా తొందర పడకుండా తనకు సెట్టయ్యే కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలని అనుకున్నాడు. అందులో భాగంగానే ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో ఒక మంచి సినిమాను పూర్తి చేసుకున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల గిరిషయ దర్శకత్వంలో ఒక సినిమాను సెట్స్ పైకి తెచ్చాడు. తెలుగులో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాను ఈ దర్శకుడు తమిళంలో రీమేక్ చేసిన విషయం తెలిసిందే.

Vaishnav tej upcoming movie heroine latest update

ఇక దర్శకుడి టాలెంట్ గురించి తెలుసుకున్న వైష్ణవ్ తేజ్ అతను చెప్పిన రొమాంటిక్ కథకు సింగిల్ సిట్టింగ్ లోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కథలో రొమాంటిక్ సన్నివేశాలు గట్టిగానే ఉంటాయట. హీరోయిన్ పాత్ర కూడా చాలా గ్లామరస్ గా ఉంటుందని తెలుస్తోంది. అయితే మొదట ఒక తమిళ హీరోయిన్ సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకున్నారట. ఇక ఆ తర్వాత మళ్లీ ఎందుకు నిర్ణయాన్ని మార్చుకుని బాలీవుడ్ బ్యూటీ శోభితా రానాను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో మెల్లగా తన స్థాయిని పెంచుకుంటుంది. హిందీలో శోబితా.. రామ్ రాజ్య, ఇష్క్ బ్రాందీ వంటి సినిమాల్లో నటించి హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. ఇక రాబోయే యాక్షన్ ఎంటర్‌టైనర్ షాడోతో శాండల్‌వుడ్‌లో కూడా అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది.

ఎక్కువ గ్లామరస్ రోల్స్ చేస్తోన్న షోబితా కుర్రాళ్లను మెల్లగా ఎట్రాక్ట్ చేస్తోంది. ఇతర ఇండస్ట్రీలో కూడా తన క్రేజ్ ని పెంచుకోవాలని అడుగులు వేస్తున్న ఈ బ్యూటీకి వైష్ణవ్ తేజ్ సినిమాలో ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఈ బ్యూటీ కూడా కథ వినగానే వెంటనే ఒప్పేసుకుంది. ఇంతకుముందు టాలీవుడ్ నుంచి కొన్ని చిన్న సినిమాల్లో ఆఫర్స్ అయితే బాగానే వచ్చాయట. కానీ అవేవి కూడా ఈ బ్యూటీకి అంతగా నచ్చకపోవడంతో రిజెక్ట్ చేసినట్లు టాక్ వస్తోంది. కానీ వైష్ణవ్ తేజ్ సినిమాపై మాత్రం బలమైన నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో అమ్మడు ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ప్రస్తతానికైతే వైష్ణవ్ చేతిలో మరో రెండు సినిమా ఆఫర్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రాజెక్టులపై క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X