మరో డిఫరెంట్ సినిమాతో రాబోతున్న వైష్ణవ్ తేజ్.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గత ఏడాది ఉప్పెన సినిమాతో భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి అవకాశాలను అందుకునే విధంగా అడుగులు వేస్తున్నాడు. సీనియర్ నిర్మాతలు ప్రముఖ దర్శకులు కూడా అతనితో సినిమా చేసేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సమయంలో వైష్ణవ్ తేజ్ తొందరపడకుండా కేవలం మంచి కాన్సెప్ట్ తో కూడిన సినిమా చేయాలని అనుకుంటున్నాడు. మొదటి సినిమా ఉప్పెన ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ సినిమా ఇండస్ట్రీలో వంద కోట్ల బిజినెస్ చేసిన సినిమాగా మంచి రికార్డు ను అందుకుంది.

ఇక వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత చేసిన కొండాపొలం సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేకపోయింది. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన సినిమా డిఫరెంట్ జోనర్ లో రావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. కానీ నటుడిగా వైష్ణవ్ తేజ్ కు మాత్రం మంచి గుర్తింపును అందించింది. ఆర్థికంగా కూడా నిర్మాతలకు మాత్రం మంచి లాభాన్ని అందించింది. దీంతో వైష్ణవ్ తో సినిమా చేస్తే మినిమం గ్యారంటీ అనేలా టాక్ వచ్చింది. ఇక అతనితో చేసేందుకు నిర్మాతలు ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ఇక ప్రస్తుతం గిరీశయ దర్శకత్వంలో కూడా ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు రంగ రంగ వైభవంగా అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే.

 Vaishnav tej upcoming project release date update

రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ బ్యూటీ ఇంతకుముందు ఆకాష్ పూరి తో రొమాంటిక్ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో కూడా వైష్ణవ్ మంచి పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. సీనియర్ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించిన విడుదల తేదీపై కూడా త్వరలోనే ఒక క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నారు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న కథనాల ప్రకారం రంగ రంగ వైభవంగా మే 27వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ కుదరకపోతే అంతకు ముందు లేదా ఆ తర్వాత అనే విధంగా కూడా ఈ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. దాదాపు మే చివరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందట. ఇంతకుముందు దర్శకుడు గిరిషయా తమిళంలో అర్జున్ రెడ్డి రీమేక్ ను డైరెక్షన్ చేసిన విషయం తెలిసిందే. తమిళంలో ఆ సినిమా మంచి గుర్తింపును అందుకుంది. ఇక ఇప్పుడు వైష్ణవ్ తో ఎలాగైనా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలని ట్రై చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన రంగ రంగ వైభవంగా ఫస్ట్ లుక్ టీజర్ కు కూడా మంచి స్పందన లభించింది. ఇక ఈ సినిమాకు కూడా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాకు కూడా నాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. మరి రంగ రంగ వైభవంగా మ్యూజిక్ ఏ విధంగా హిట్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X