దేశ వ్యాప్తంగా పవన్ కల్యాణ్ హవా: ఊహించని రికార్డు దిశగా అడుగులు.. వాళ్లిద్దరిలో ఎవరు బెస్ట్ అంటూ!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ కోసం ఆయన అభిమానులే కాదు.. సినీ ప్రియులంతా వేయి కళ్లతో వేచి చూసిన విషయం తెలిసిందే. వాళ్లందరి ఆశను నిజం చేస్తూ.. దాదాపు మూడేళ్ల తర్వాత 'వకీల్ సాబ్' మూవీతో కమ్‌బ్యాక్ అయ్యాడు పవన్. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ టాక్‌ను అందుకుంది. అయితే, ప్రతికూల పరిస్థితుల కారణంగా కలెక్షన్ల పరంగా నష్టాలనే ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' మూవీ ఊహించని రికార్డు దిశగా పయనిస్తోంది. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

‘వకీల్ సాబ్'గా రీఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్

‘వకీల్ సాబ్'గా రీఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సుదీర్ఘ విరామం తర్వాత నటించిన చిత్రం 'వకీల్ సాబ్'. ఆడవాళ్ల సమస్యలను ప్రస్తావిస్తూ తీసిన ఈ సినిమాను వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమాను బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించాడు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించాడు. అంజలి, అనన్య, నివేదా థామస్‌లు కీలక పాత్రలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వరుస దెబ్బలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వరుస దెబ్బలు

ఆరంభం నుంచే 'వకీల్ సాబ్' చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వరుసగా దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఈ సినిమా బెనిఫిట్, స్పెషల్ షోలు రద్దు చేసిన జగన్ సర్కారు.. ఆ వెంటనే టికెట్ రేట్లను తగ్గించాలని కొత్త జీవోను తీసుకొచ్చింది. దీంతో పవన్ కల్యాణ్ సినిమా కలెక్షన్లపై తీవ్ర స్థాయిలో ప్రభావం పడిపోయింది. ఆ తర్వాత కరోనా కారణంగా థియేటర్లు మూత పడిపోయాయి.

కలెక్షన్లపై ప్రభావం... నష్టాలతో ముగిసిందిగా

కలెక్షన్లపై ప్రభావం... నష్టాలతో ముగిసిందిగా

'వకీల్ సాబ్' మూవీకి ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ పరంగా ఇది ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ మంచి కలెక్షన్లను అందుకుంది. అయితే, లాంగ్‌ రన్‌లో మాత్రం పలు కారణాల వల్ల వసూళ్లు బాగా తగ్గిపోయాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ చేరుకోకుండానే సినిమా రన్ ముగిసిపోయింది. తద్వారా నష్టాలు వచ్చాయి.

అందులో ముందుగానే రిలీజైన ‘వకీల్ సాబ్'

అందులో ముందుగానే రిలీజైన ‘వకీల్ సాబ్'

'వకీల్ సాబ్' సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. ఆరంభంలో దిల్ రాజు మాట్లాడుతూ.. ఈ సినిమాను యాభై రోజుల తర్వాతనే ఓటీటీలో విడుదల చేస్తామని చెప్పారు. కానీ, థియేటర్లలో కేవలం రెండు వారాలు మాత్రమే ప్రదర్శితమైన 'వకీల్ సాబ్'.. ఆ తర్వాత రన్‌ను ముగించుకుంది. దీంతో అమెజాన్‌లో ఇటీవలే విడుదల చేశారు.

అక్కడ కూడా హవా చూపించిన పవర్ స్టార్

అక్కడ కూడా హవా చూపించిన పవర్ స్టార్

ఏప్రిల్ 30 అమెజాన్ ప్రైమ్‌లో 'వకీల్ సాబ్' మూవీ విడుదలైంది. థియేటర్లలో మాదిరిగానే ఈ చిత్రానికి అక్కడ కూడా భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఇప్పటికే సినిమాను చూసిన వాళ్లతో పాటు కొత్త వాళ్లు కూడా దీన్ని చూస్తున్నారు. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ పవన్ కల్యాణ్ పేరును మరోసారి ట్రెండ్ చేస్తున్నారు.

ఊహించని రికార్డు దిశగా.. నేషనల్ వైడ్ ట్రెండ్

ఊహించని రికార్డు దిశగా.. నేషనల్ వైడ్ ట్రెండ్

పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' చిత్రానికి అమెజాన్ ప్రైమ్‌లో ఊహించిన దాని కంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తుందట. ఇప్పటికే ఇది వంద మిలియన్లకు పైగా క్లిక్స్ సాధించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఇదే కొనసాగితే మరో రెండు మూడు రోజుల్లోనే నేషనల్ రికార్డు బద్దలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని విశ్వసనీయంగా తెలిసింది. ఇదే జరిగితే పవన్ రేంజ్ కూడా పెరుగుతుంది.

Recommended Video

Allu Arjun Tests COVID-Positive, In Home Quarantine | Filmibeat telugu
వాళ్లిద్దరిలో ఎవరు బెస్ట్ అంటూ చూస్తున్నారు

వాళ్లిద్దరిలో ఎవరు బెస్ట్ అంటూ చూస్తున్నారు

'వకీల్ సాబ్' మూవీ పింక్‌కు రీమేక్‌గా వచ్చిన విషయం తెలిసిందే. అందులో అమితాబ్ బచ్చన్‌, తమిళంలో వచ్చిన 'నెర్కొండ పార్వాయి'లో అజిత్ కుమార్ నటించారు. వాళ్లిద్దరి నటనను చూసిన వారంతా అమెజాన్ ప్రైమ్‌లో 'వకీల్ సాబ్'పై లుక్కేస్తున్నారట. పవన్ యాక్టింగ్‌ను చూసేందుకు తమిళం, హిందీ ప్రేక్షకులు సైతం ఎక్కువగా క్లిక్స్ చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X