ఆ ఇద్దరి కోసం మహేశ్ బాబు మాస్టర్ ప్లాన్.. హిట్టిచ్చిన దర్శకులతో భారీ స్కెచ్.!

By Manoj Kumar P

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న టాప్ హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. హ్యాండ్సమ్‌ లుక్‌తో పాటు అద్భుతమైన నటనను కనబరచగల నైపుణ్యం ఉండడంతో అతడు చాలా కాలంగా ఇండస్ట్రీలో ప్రభావాన్ని చూపగలుగుతున్నాడు. అదే సమయంలో వరుసగా సినిమాలు చేస్తూ ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. కొన్నేళ్లుగా సూపర్ ఫామ్‌లో కనిపిస్తున్న మహేశ్ బాబు.. ఇద్దరు యంగ్ హీరోలు.. ఇద్దరు స్టార్ డైరెక్టర్లతో డీల్ కుదుర్చుకున్నాడని తాజాగా ఓ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

ఇండస్ట్రీ హిట్‌తో పాటు అరుదైన ఘనత

ఇండస్ట్రీ హిట్‌తో పాటు అరుదైన ఘనత

వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఆ మధ్య ‘భరత్ అనే నేను'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కిన అతడు... ఆ వెంటనే ‘మహర్షి'తో మరో బంపర్ హిట్‌ను సాధించాడు. ఈ క్రమంలోనే ‘సరిలేరు నీకెవ్వరు'తో మరొక విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఫలితంగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్న హీరోగా ఘనత దక్కించుకున్నాడు.

ఒకరనుకుంటే మరొకరు ఫిక్సయ్యారు

ఒకరనుకుంటే మరొకరు ఫిక్సయ్యారు

‘సరిలేరు నీకెవ్వరు' విజయంతో మాంచి జోష్ మీద ఉన్నాడు మహేశ్ బాబు. ఈ ఊపులోనే ‘మహర్షి' దర్శకుడు వంశీ పైడిపల్లితో సినిమా చేయడానికి అంగీకరించాడు. గ్యాంగ్‌స్టర్ కథతో మాఫియా బ్యాగ్‌డ్రాప్‌తో ఈ మూవీ రూపొందుతుందని ప్రచారం జరిగింది. కానీ, ఊహించని విధంగా ఆ సినిమా ప్రకటనకు ముందే ఆగిపోయింది. ఆ వెంటనే మరో దర్శకుడిని లైన్‌లో పెట్టాడు మహేశ్.

బిజినెస్‌మ్యాన్‌లను టార్గెట్ చేస్తున్నాడు

బిజినెస్‌మ్యాన్‌లను టార్గెట్ చేస్తున్నాడు

‘గీత గోవిందం'తో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు పరశురాంతో మహేశ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘సర్కారు వారి పాట' అనే టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీని మూడు సంస్థలు నిర్మిస్తున్నాయి. బ్యాంకులను మోసం చేస్తున్న వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ ఈ చిత్ర కథను రూపొందించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం.

రియల్ హీరో స్టోరీతో మహేశ్ మూవీ

రియల్ హీరో స్టోరీతో మహేశ్ మూవీ

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగానే కాకుండా నిర్మాతగానూ సరికొత్త అవతారం ఎత్తిన విషయం తెలిసిందే. ‘జి మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్' అనే నిర్మాణ సంస్థతో ఇప్పటికే కొన్ని సినిమాలు రూపొందించారు. ఇక, ఈ సంస్థ ద్వారా అడవి శేష్ హీరోగా ‘మేజర్' అనే సినిమా తెరకెక్కుతోంది. శ‌శికిర‌ణ్ తిక్క రూపొందిస్తోన్న ఈ సినిమా రియల్ హీరో కథతో రూపొందుతోంది.

హిట్టిచ్చిన దర్శకులకు మరో అవకాశం

హిట్టిచ్చిన దర్శకులకు మరో అవకాశం

తాజాగా మహేశ్ బాబు గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. రీసెంట్‌గా తనకు రెండు హిట్లు అందించిన దర్శకులు వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడికి అతడు మరో అవకాశం ఇచ్చాడనేదే ఆ వార్త సారాంశం. అయితే, ఆ రెండు సినిమాల్లో మహేశ్ బాబు హీరోగా నటించడం లేదట. వాటికి నిర్మాతగా మాత్రమే వ్యవహరించబోతున్నాడని తెలిసింది.

Recommended Video

Sushant Singh Rajput : సుశాంత్ కేసు లో Rhea Chakraborty పై కేసు వేసిన Sushant అభిమాని
ఆ హీరోల కోసం మహేశ్ మాస్టర్ ప్లాన్

ఆ హీరోల కోసం మహేశ్ మాస్టర్ ప్లాన్

వాస్తవానికి మహేశ్ ప్రొడక్షన్‌లో విజయ్ దేవరకొండ నటించబోతున్నాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు దానిని నిజం చేసేలా వంశీ పైడిపల్లితో సూపర్ స్టార్ డీల్ కుదుర్చుకున్నాడని తెలుస్తోంది. అలాగే, అనిల్ రావిపూడిని మరో యంగ్ హీరో కోసం సెట్ చేశాడని అంటున్నారు. ఈ రెండింటి ప్రకటన త్వరలోనే వెలువడనుందనే టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X