సరికొత్త పాయింట్‌తో రాంచరణ్ కొత్త సినిమా!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ వరుస చిత్రాలతో బిజీ కాబోతున్నాడు. రాంచరణ్ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ అజర్బైజాన్ లో జరుగుతోంది. ఈ చిత్రం తరువాత ఎన్టీఆర్ తో కలసి రాజమౌళి చిత్రంలో నటించాల్సి ఉంది.
ఎవడు లాంటి సూపర్ హిట్ అందించిన వంశీ పైడిపల్లి దర్శత్వంలో రాంచరణ్ నటించబోతున్నట్లు సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. వంశీపైడి పల్లి వివరించిన ఆసక్తిక్రమైన పాయింట్ నచ్చడంతో చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి కథ సిద్ధం చేయమని చెప్పాడట.

అన్నీ కుదిరితే 2020 ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వంశీపైడిపల్లి సూపర్ స్టార్ మహేష్ తో మహర్షి చిత్రాన్ని తెరకెక్కించేపనిలో బిజీ గా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











