నిర్మాతగా విజయ్ దేవరకొండ... బంపర్ ఛాన్స్ కొట్టేసిన టీవీ నటి!

Recommended Video

Vijay Deverakonda And TV Actress Vani Bhojan Come Together! || Filmibeat Telugu

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా ఇలా వరుస విజయాలు అందుకుంటూ దూసుకెళుతున్న విజయ్ దేవరకొండ అతి తక్కువ కాలంలోనే తెలుగులో స్టార్ హీరో హోదా సొంతం చేసుకున్నాడు. కేవలం హీరోగా సినిమాలు చేయడానికే పరిమితం కాకుండా... సినిమా నిర్మాణ రంగం వైపు కూడా విజయ్ దృష్టి సారిస్తున్నాడు.

'కింగ్ ఆఫ్ ది హిల్' పేరుతో సొంత బేనర్ స్థాపంచిన విజయ్.. ఈ బేనర్లో మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు నిర్మిస్తున్నారు.ఆల్రెడీ 'పెళ్లి చూపులు' డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌ హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా కూడా మొదలైంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

తమిళ టీవీ నటి కీలక పాత్రలో...

తమిళ టీవీ నటి కీలక పాత్రలో...

ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... తమిళ టీవీ నటి వాణి భోజన్ ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ మూవీ ద్వారా ఆమె తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు.

డైరెక్టర్ ఎవరంటే..

డైరెక్టర్ ఎవరంటే..

ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రానికి షార్ట్ ఫిల్మ్ మేకర్ షమ్మీర్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాకు సంబంధించిన షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మూవీ టీం పూర్తి వివరాలు అఫీషియల్‌గా వెల్లడించనుంది.

యాంకర్ అనసూయ కీలక పాత్రలో

యాంకర్ అనసూయ కీలక పాత్రలో

ఈ చిత్రంలో యాంకర్ అనసూయ కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రం ఎలా ఉండబోతోంది? కాన్సెప్టు ఏమిటి? విషయాలపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది. షూటింగ్ పూర్తయ్యాక ఒకేసారి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసి సినిమా ప్రమోషన్స్ నిర్వహించబోతున్నారు.

విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీని తర్వాత క్రాంతి మాధవ్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X