కష్టాల్లో ఉన్న డ్యాన్సర్లకు సినీ హీరో సహాయం.. నేరుగా అకౌంట్లలోకి డబ్బులు..

లాక్‌డౌన్ కారణంగా సినీ పరిశ్రమ స్తంభించడంతో ఎందరో వేతన సినీ కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయి. అలాంటి వారిని గత మూడు, నాలుగు నెలలుగా సినీపరిశ్రమ యూనియన్లు, హీరోలు, హీరోయిన్లు తమకు తోచిన విధంగా ఆదుకొంటున్నారు. తాజాగా తన సినిమాలకు పనిచేసిన 200 మంది డ్యాన్సర్లను సినీ హీరో వరుణ్ ధావన్ ఆదుకొన్నారు.

స్ట్రీట్ డ్యాన్సర్ 3డీ, ఏబీసీడీ 2 సినిమాలకు పనిచేసిన 200 మంది బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్లు ఆర్థికంగా ఇబ్బందికి గురవుతున్నారని తెలుసుకొన్న హీరో వరుణ్ ధానవ్ సహాయం అందించేందుకు ముందుకొచ్చారు. ఈ విషయాన్ని డ్యాన్సర్ల కోఆర్డినేటర్స్ మేనేజర్ మీడియాకు వెల్లడించారు. హీరో వరుణ్ ధావన్ ఆర్థికంగా సమస్యలకు ఎదుర్కొంటున్న డ్యాన్సర్లకు సహాయం అందించారు. దాదాపు డ్యాన్సర్లంతా మూడు సినిమాలకు పనిచేశారు.

Varun Dhawan helps 200 dancers and transfers money to account

తన సినిమాలకు పనిచేసిన వారు ఇంటి అద్దెలు చెల్లించడానికి ఇబ్బంది పడుతున్నారని, అలాగే కొంతమంది తన తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వైద్య చేయించడానికి కష్టాలు పడుతున్నారని తెలుసుకొని వరుణ్ ధావన్ సహాయం అందించారు. డ్యాన్సర్ల అకౌంట్లకే నేరుగా డబ్బులు పంపించారు అని మేనేజర్ పేర్కొన్నారు.

ప్రస్తుతం వరుణ్ ధావన్ సారా ఆలీ ఖాన్‌తో కలిసి కూలీ నంబర్ 1 చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుంది. కరోనా లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X