ఆ హీరో కౌగిలిలో నలిగిన సమంత.. అసలు ఏం జరిగిందంటే?
గత కొన్నాళ్ల నుంచి సౌత్ సినిమా దగ్గర పలు కాంట్రవర్సీలు ఏ రకంగా ఊపందుకున్నాయో తెలిసిందే. కాగా ఈ క్రమంలో వినిపించిన అనేకమంది సినీ ప్రముఖుల్లో నటి సమంత కూడా ఉంది. మరి సామ్ పై పలు సంచలన ఆరోపణలు, తన మాజీ భర్త టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య అలాగే కుటుంబం సంబంధించి వచ్చిన కామెంట్స్ కానీ పెద్ద ఎత్తున సంచలనం రేపాయి.
కాగా చైతు రెండో పెళ్లి విషయంలో ఏమి మాట్లాడని సామ్ తర్వాత పొలిటికల్ గా తన వరకు పలు షాకింగ్ అభియోగాలు వచ్చేసరికి మాత్రం ఆమె నోరు విప్పాల్సి వచ్చింది. అయితే సమంత నాగ చైతన్య నుంచి విడిపోయిన తర్వాత తన కెరీర్ పరంగా ఎన్నడూ చూపించని హాట్ యాంగిల్ ని చూపించింది అనే మాట వాస్తవం.

అది పుష్ప 1 లో క్రేజీ ఐటెం సాంగ్ నుంచి ఆఫ్ లైన్ లో తన అందాల ఆరబోత వరకు ఒకింత డోస్ ని ఎక్కువే చేసింది. అయితే నాగ చైతన్య తన విడాకులు తర్వాత రెండో పెళ్ళికి సిద్ధం అయ్యిపోయాడు. కానీ సామ్ మాత్రం ఇంకా ఒంటరిగానే ఉంది సినిమాలు వెబ్ సిరీస్ లు చేస్తుంది.
సరే ఇది బాగానే ఉంది కానీ సమంత కూడా ఎవరో ఒకరితో రిలేషన్ లోనే ఉంది అని కూడా పలు పుకార్లు లేకపోలేవు కానీ వాటిలో ఎంతవరకు నిజం ఉంది అనేది కూడా ఎవరికీ తెలియదు. అయితే ఇపుడు ఓ షాకింగ్ పోస్ట్ అందరి కళ్ళు పెద్దవి అయ్యేలా చేసింది. ఇపుడు సమంత బాలీవుడ్ స్టార్ నటుడు వరుణ్ ధావన్ తో భారీ వెబ్ సిరీస్ "సిటాడెల్ - హనీ బన్నీ" చేసింది.

దీని తాలూకా ప్రమోషన్స్ లో కూడా తాము ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే లేటెస్ట్ గా ఆన్లైన్ లో వరుణ్ ధావన్ పెట్టిన తాజా పోస్ట్ అటెన్షన్ తెచ్చుకుంది. ఇందులో సమంతతో వరుణ్ చాలా క్లోజ్ గా కనిపిస్తూ మాంచి రొమాంటిక్ గా కనిపిస్తున్నారు. అయితే కనీసం తమ ఇద్దరి సిరీస్ పోస్టర్ కానీ ట్యాగ్ కానీ లేకుండా ఇది పోస్ట్ చేయడం మాత్రం ఒక రకమైన అనుమానాలు రేకెత్తిస్తుంది.
దీనితో ఇద్దరూ కానీ డేటింగ్ లో ఉన్నారా అంటూ టాక్ కూడా మొదలైంది. ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఈ పోస్ట్ లో వరుణ్ ధావన్ మన తెలుగు పాట అది కూడా సమంత నటించిన హిట్ సినిమా ఈగ సినిమాలో రొమాంటిక్ మెలోడీ పెట్టి వదలడం విశేషం. దీనితో అసలు ఈ ఇద్దరి నడుమ ఏం జరుగుతుంది అనే కొత్త కొత్త ప్రశ్నలు ఇపుడు మొదలవుతున్నాయి.
ఇలా మొత్తానికి అయితే తమ వెబ్ సిరీస్ ఏమో కానీ వీరిద్దరి నడుమ ఈ రొమాంటిక్ పోస్టర్ మాత్రం ఓ రేంజ్ లో చర్చకు దారి తీసింది. మరి చూడాలి ఇది కేవలం వెబ్ సిరీస్ కి సంబంధించింది మాత్రమేనా లేక ఇద్దరు నడుమ ఏమన్నా ఉందా అనేది. అన్నట్టు ఈ వెబ్ సిరీస్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో వారు నిర్మాణం వహించగా ఈ నవంబర్ 7 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి రానుంది.


Click it and Unblock the Notifications











