వెంకటేష్ బ్లాక్ బస్టర్ చిత్రానికి బాలీవుడ్‌లో సీక్వెల్!

విక్టరీ వెంకటేష్, టబు జంటగా నటించిన కూలి నెంబర్ 1 చిత్రం ఘనవిజయం సాధించింది. 1991లో విడుదలైన ఈ చిత్రం వెంకటేష్ క్రేజ్ ని ఇంకాస్త పెంచింది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 1995లో కూలి నెం1 చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేశారు. బాలీవుడ్ రీమేక్ లో సీనియర్ నటుడు గోవిందా, కరిష్మా కపూర్ జంటగా నటించారు.డేవిడ్ ధావన్ ఈ చిత్రానికి దర్శకుడు. బాలీవుడ్ లో కూడా ఈ చిత్రం ఘనవిజయం సాధించింది.

తాజాగా ఈ చిత్ర సీక్వెల్ కు సన్నాహకాలు జరుగుతున్నాయి. దర్శకుడు డేవిడ్ ధావన్ తన కుమారుడు వరుణ్ ధావన్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. వరుణ్ ధావన్ బాలీవుడ్ క్రేజీ హీరోగా ఎదిగాడు. ఈ చిత్రంలో వరుణ్ ధావన్ కు జోడిగా యంగ్ బ్యూటీ సారా అలీఖాన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది.

Varun Dhawan to star in Govinda’s Coolie No 1 remake

మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ చిత్రాన్ని వరుణ్ ధావన్ సోదరుడు రోహిత్ ధావన్ నిర్మించనున్నారు. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. వరుణ్ ధావన్ చివరగా నటించిన చిత్రం సూయి దాగా. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. సారా అలీఖాన్ కూడా సింబా రూపంలో ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X