హ్యాపీడేస్ 2పై శేఖర్ కమ్ముల అప్పుడే చెప్పారు.. కానీ లీడర్ తరువాత..: వరుణ్ సందేశ్

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వగానే వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న అతి కొద్దిమంది హీరోలలో వరుణ్ సందేశ్ ఒకరు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి మంచి హీరో గా ఎంట్రీ ఇచ్చాడు వరుణ్ సందేశ్. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వరుణ్ హ్యాపీడేస్ 2 పై కూడా కూడా ఒక వివరణ ఇచ్చారు.

కంటిన్యూ చేయలేకపోయినా వరుణ్1

కంటిన్యూ చేయలేకపోయినా వరుణ్1

హ్యాపీడేస్ సినిమాలో నటించిన వారిలో కొందరు ఇండస్ట్రీలో మంచి స్టార్ ఇమేజ్ ను కూడా అందుకున్నారు.

కానీ మరికొందరు మాత్రం ఆ స్టార్ ఇమేజ్ ను కంటిన్యూ చేయలేకపోయారు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది వరుణ్ సందేశ్ గురించి. వరుణ్ సందేశ్ తప్పకుండా మంచి హీరో అవుతాడని మొదట్లోనే అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. కానీ అతను రొటీన్ కమర్షియల్ సినిమాలే ఎక్కువగా చేయడం వలన మెల్లగా స్టార్ హోదా తగ్గుతూ వచ్చింది.

బిగ్ బాస్ ద్వారా..

బిగ్ బాస్ ద్వారా..

ప్రస్తుతం కూడా వరుణ్ సందేశ్ మళ్లీ ట్రాక్ లోకి రావాలి అని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఎంత ప్రయత్నం చేసినా కూడా అతనికి బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ రావడం లేదు. అంతే కాకుండా పేరున్న దర్శకులు నుంచి ప్రొడక్షన్ హౌస్ నుంచి కూడా ఆఫర్లు రావడం లేదు. ఆ మధ్యకాలంలో బిగ్ బాస్ సీజన్ 3 ద్వారా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేశాడు. తన భార్యతో కలిసి బిగ్ బాస్ సీజన్ త్రీ లో పాల్గొన్న వరుణ్ సందేశ్ మూడవ రన్నరప్ గా నిలిచాడు.

 మళ్ళీ చాలా కాలం తరువాత..

మళ్ళీ చాలా కాలం తరువాత..

మంచి క్రేజ్ అయితే అందుకున్నాడు కానీ ఆ తర్వాత కూడా వరుణ్ సందేశ్ కి అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. హౌస్ లో నుంచి బయటికి రాగానే రెండు మూడు సినిమాలు చేశాడు కానీ అవి బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాలు అందుకున్నాయి. ఇక ఇటీవల వరుణ్ సందేశ్ ఇందువదన అనే సినిమాతో మళ్ళీ తన క్రేజ్ ను పెంచుకోవాలని చూస్తున్నాడు. ఇక వరుసగా ఇంటర్వ్యూలో ఇస్తున్న వరుణ్ సందేశ్ హ్యాపీ డేస్ సీక్వెల్ పై కూడా ఎవరూ ఊహించని విధంగా ఒక కామెంట్ అయితే చేశాడు.

 హ్యాపీడేస్ 2.. అప్పుడే అన్నారు

హ్యాపీడేస్ 2.. అప్పుడే అన్నారు

హ్యాపీ డేస్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ గా నిలిచిన తర్వాత శేఖర్ కమ్ముల గారు ఒక రోజు పిలిచి తప్పకుండా మనం హ్యాపీ డేస్ 2 చేద్దామని చెప్పారు. అప్పుడు అందరూ ఓకే అన్నారు. అప్పుడు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఆయన అనుకోకుండా మళ్లీ లీడర్ అంటూ వేరే సినిమాలతో బిజీ అయిపోయారు.

మళ్ళీ టచ్ లోకి వెళ్లలేదు..

మళ్ళీ టచ్ లోకి వెళ్లలేదు..

ఆ తర్వాత నేను కూడా పెద్దగా మళ్లీ టచ్ లో కి వెళ్ళలేదు. ఎందుకో గాని మళ్లీ ఆయన హ్యాపీడేస్ 2 ఐడియా గురించి ప్రస్తావన తీసుకు రాలేదు అని వరుణ్ వివరణ ఇచ్చారు. ఇక శేఖర్ కమ్ముల లాంటి దర్శకుడితో పని చేయడం అంటే మామూలు విషయం కాదు అని ఆయన సినిమాల్లో అవకాశం దొరకాలి అంటే చాలా మంది ఆడిషన్స్ ను దాటుకుంటూ వెళ్లాలి అని తెలియజేశాడు.

ఆయన చేతుల్లో పడితే..

ఆయన చేతుల్లో పడితే..

ఇక హ్యాపీ డేస్ సినిమా కోసం అయితే దాదాపు నెల రోజుల పాటు ఆయన ఆఫీసులోనే వర్క్ షాప్స్ కూడా చేసినట్లు చెబుతూ శేఖర్ కమ్ముల గారి తో వర్క్ చేస్తే చాలు ఇక ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. రాబోయే నటులకి ఆయన లాంటి దర్శకుల చేతుల్లో పడితే నటుడిగా చాలా నేర్చుకుంటారు అని వరుణ్ సందేశ్ వివరణ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X