For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జాకెట్ లేకుండా హీరోయిన్, అలానే కౌగిలించుకున్న వరుణ్ సందేశ్.. షాక్ ఇచ్చేలా ఉన్నాడు

  |

  టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది యువ హీరోలు కొన్నాళ్ళకే కనుమరుగై పోతున్నారు. మొదట్లో సక్సెస్ లేని హీరోలు సినిమాలు చేయడం లేదంటే లక్కు బాలేదేమో అనుకోవచ్చు. కానీ సక్సెస్ రుచి తెలిసిన యువకులు కూడా చాలా తొందరగా మాయమవుతున్నారు. అయితే అలా కాకుండా కొంతమంది యువ నటులు ఎదో ఒక విధంగా జనాలు మరోసారి గుర్తించేలా అడుగులు వేస్తున్నారు. వరుణ్ సందేశ్ కూడా కాస్త కొత్తగా ప్రయత్నం చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

  వరుసగా బాక్సాఫీస్ హిట్స్

  వరుసగా బాక్సాఫీస్ హిట్స్

  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో నటుడిగా కెరీర్ ను స్టార్ట్ చేసిన వరుణ్ సందేశ్ అప్పట్లో ఏ స్థాయిలో క్రేజ్ అందుకున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రెండవ సినిమా కొత్త బంగారులోకం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంది.

  అలా దెబ్బ పడింది

  అలా దెబ్బ పడింది

  యూత్ లో కూడా మంచి క్రేజ్ రావడంతో వరుణ్ సందేశ్ ఈజీగా క్లిక్కవుతాడు అని అనుకున్నారు. కానీ ఆ రెండు సినిమాల తరువాత అతని స్టోరీ సెలక్షన్ ఏ మాత్రం వర్కౌట్ కాలేదు. కమిట్మెంట్ కారణంగా కొన్ని సినిమాలు తప్పనిసరిగా చేయడం వలన కూడా దెబ్బ పడింది. ఎలాంటి సినిమా చేసినా కూడా హెల్ప్ అవ్వలేదు.

  వరుసగా 15 సినిమాలు..

  వరుసగా 15 సినిమాలు..

  కొన్నేళ్ల క్రితం సంపత్ నంది దర్శకత్వంలో చేసిన ఏమైంది ఈ వేళ సినిమా కమర్షియల్ కొంత బాగానే ఆడింది. అయినప్పటికీ వరుణ్ సందేశ్ ఫామ్ లోకి రాలేదు. దాదాపు వరుసగా 15 సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇక పెళ్లి అనంతరం వరుణ్ యూఎస్ కు వెళ్లిపోయాడు. సినిమా ఛాన్సులు వస్తేనే మళ్ళీ ఇండియాకు వస్తున్నాడు.

  బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా..

  బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా..

  వీలైనంత వరకు ఇక నుంచి మంచి కాన్సెప్ట్ కథలను సెలెక్ట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నాడట. ఇక ముందు జనాల్లో మంచి క్రేజ్ తెచ్చుకోవాలని ఆ మధ్య తెలుగు బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా వెళ్లిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు భార్య కూడా వచ్చింది. ఆ తరువాత కూడా వరుణ్ కు చెప్పుకోదగ్గ ఛాన్సులేమి రాలేదు.

  జాకెట్ లేకుండా హీరోయిన్..

  జాకెట్ లేకుండా హీరోయిన్..

  ఇక ఫైనల్ గా ఇప్పుడు ఇందువదన అనే సినిమాతో రెడీ అయ్యాడు. జాకెట్ లేకుండా ఉన్న హీరోయిన్ ఫర్నాజ్ సెట్టిని కౌగిలించుకున్న పోస్టర్ ఒకటి రిలీజ్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెండు రోజుల క్రితమే వరుణ్ ఒక కామెడీ ప్రోమో ద్వారా సరికొత్త సినిమాతో రాబోతున్నట్లు చెప్పాడు.

  Ormax 2020 : Premi Viswanath Bags A New Award For Karthika Deepam | Filmibeat Telugu
  మొదటిసారి కొత్త ప్రయత్నం

  మొదటిసారి కొత్త ప్రయత్నం

  ఇంతవరకు వరుణ్ లవ్ స్టోరీస్ వంటి కథలనే ఎక్కువగా సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక ఇందువదన పోస్టర్ చూస్తుంటే ఎదో కొత్తగా ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. చూస్తుంటే సినిమా పిరియాడిక్ కాన్సెప్ట్ గా తెరకెక్కుతున్నట్లు అనిపిస్తోంది. మరి సినిమా జనాలకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి. ఎంఎస్ఆర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మాధవి అదుర్తి నిర్మిస్తున్నారు. త్వరలోనే టీజర్ ను కూడా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.

  English summary
  Some young actors are stepping in to somehow get people to recognize them once again. It seems that Varun Sandesh is also planning to try something new..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X