‘ఆ హీరోయిన్‌తో రిలేషన్‌షిప్‌లో.. మీరంతా అనుకొనే హీరోయిన్‌తో కాదు‘

తరుణ్, ఉదయ్ కిరణ్ తర్వాత తెలుగునాట అంతటి లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నారు వరుణ్ సందేశ్. హ్యాపీడేస్, కొత్త బంగారు లోకం, కుర్రాడు, మరో చరిత్ర, ఎవరైనా ఎపుడైనా తదితర చిత్రాలతో టాలీవుడ్‌లో స్టార్ హీరోగా దూసుకొచ్చాడు వరుణ్ సందేశ్. అయితే మధ్యలో వరుస ఫ్లాపులు ఎదురుకావడంతో తన సక్సెస్‌ను కొనసాగించలేకపోయాడు. ఆ తర్వాత ఏవేవో సినిమాలు తీసినా అవి హిట్ కాలేపోయాయి. చివరికి సెకండ్ లీడ్ రోల్స్, హీరో ఫ్రెండ్ రోల్స్ కూడా చేయాల్సిన పరిస్ధితి వచ్చింది. అయినప్పటికీ నిరాశ పడకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నా తనకు అదృష్టం కలిసిరావడం లేదు.

వెండితెరపై వరుస పరాజయాల నేపథ్యంలో ప్రేక్షకులకు దగ్గర కావడానికి బుల్లితెరను ఎంచుకున్నాడు వరుణ్. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3లో కంటెస్టెంట్‌గా వచ్చి థర్డ్ రన్నరప్‌గా నిలిచాడు. నటి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ వితికా షేరును ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. లాంగ్ గ్యాప్ తర్వాత విరాజి, కానిస్టేబుల్ అనే సినిమాలతో పలకరించినా ప్రేక్షకులు ఆదరించలేదు. ఆ తర్వాత నయనం అనే వెబ్ సిరీస్‌లో నటించాడు వరుణ్ సందేశ్. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వరుణ్.

Varun Sandesh Opens Up About Career Failures Relationships and Happy Days Success

నాతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్లు ఇప్పుడు సూపర్‌స్టార్లుగా ఉన్నారు వారిని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. స్క్రిప్ట్ సెలక్షన్, నేను విన్నప్పుడు ఒకలా ఉండి.. ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఒకలా ఉండటం వల్ల కొన్ని తప్పులు జరిగాయి. నూటికి నూరుశాతం తప్పులకు బాధ్యత నాదే. ఆ టైంలో నేను అంతగా ఫోకస్ చేయలేదు. ఆ సమయంలో నాకు 18 ఏళ్లు .. స్క్రిప్ట్ గురించి ఇంకా ఫోకస్ చేయలేకపోయుండొచ్చు. నేను చేసిన సినిమాలు ఆ టైంలో వర్కవుట్ కాలేదు. కానీ ఇప్పుడు తీసుకొచ్చి చూస్తే చాలా ఫ్రెష్‌గా అనిపిస్తాయి. ఇటీవల హిట్ అయిన కొన్ని సినిమాల కథ చూస్తే .. నేను అప్పట్లోనే చేసేశాను. అయితే ఆ సమయంలో ఎగ్జిక్యూషన్ సరిగా కుదరలేదని వరుణ్ సందేశ్ అభిప్రాయపడ్డారు.

ఇన్నేళ్ల కెరీర్‌లో నేను నేర్చుకున్నది నో చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. వెంటనే నో అని చెప్పలేకపోవడం నా బలహీనత. అవసరాలు, మొహమాటం దీనికి తోడు నా వయసు కూడా చాలా చిన్నది. ఎక్కడ అవసరమో అక్కడ నో చెప్పాలన్నది నేను నేర్చుకున్న గుణపాఠం. స్విగ్గీ కోసమే ఎక్కువ ఖర్చు పెడతా.. రోజుకు 2 నుంచి 3 వేల రూపాయలు స్విగ్గీ కోసమే ఖర్చు పెడతా. పనికొచ్చే వాటికి ఖర్చు చేయను.. అనవసరపు ఖర్చులే. మనీ కంట్రోల్ చేయడంలో నేను జీరో. చిన్నప్పటి నుంచి మా అమ్మానాన్న చూసుకునేవాళ్లు.. ఇప్పుడేమో వితికా చూసుకుంటోందిని వరుణ్ తెలిపారు.

ఇటీవల హ్యాపీడేస్ రీ రిలీజ్ చేశారు. సినిమా చూద్దామని థియేటర్‌కు వెళితే.. ఆ రెస్పాన్స్ అస్సలు ఊహించలేదు. ఒక సినిమా థియేటర్‌కు వెళ్లినట్లుగా అనిపించలేదు. ఏదో ఒక కన్సర్ట్‌కి వెళ్లినట్లుగా అనిపించింది. సాంగ్స్ వస్తుంటే అందరూ పాడటం జనాలు మామూలుగా కనెక్ట్ కాలేదు ఆ సినిమాకు. ఇప్పటికీ కూడా అంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారంటే ఆ సినిమాలో ఏదో మేజిక్ ఉంది. ఆ సినిమా చేస్తున్నప్పుడు కానీ, రిలీజ్ అయినప్పుడు కూడా నాకేం అర్ధం కాలేదు. అప్పుడు నాకు 18 ఏళ్లు మాత్రమే.. సినిమా స్టార్ట్ చేసినప్పుడు 17 ఏళ్లు. సీబీఐటీ లైబ్రరీ ముందర మొత్తం ప్యాకప్ చెప్పిన తర్వాత అందరి ముందు కేక్ కటింగ్ చేశాను. అదే నా 18వ బర్త్ డే. ఆ రోజు నాకింకా గుర్తుంది. 18 ఇయర్స్ అప్పుడు సినిమా రిలీజ్ అయితే హిట్టా? అనేది ఏం తెలియదు.. ఈ ఫీల్డ్ గురించి నాలెడ్జ్ కూడా లేదని వరుణ్ సందేశ్ గుర్తుచేసుకున్నారు.

ఫస్ట్ రిలేషన్‌షిప్‌లో ఎప్పుడున్నారని యాంకర్ అడగ్గా.. దానికి వరుణ్ సందేశ్ ఇలా సమాధానం ఇచ్చారు. హ్యాపీడేస్ తర్వాతే రిలేషన్‌లో ఉన్నా. ఆమె కూడా సినీ నటే కాకపోతే మీ అందరూ అనుకుంటున్నట్లు ఆ నటి కాదు. ఒక నటితో వరుణ్ సందేశ్ రిలేషన్‌లో ఉన్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఆ అమ్మాయి కాదు.. కానీ తను కూడా ఒక నటేనని వరుణ్ చెప్పారు. ఎన్నాళ్లు ఆమెతో రిలేషన్‌షిప్‌లో ఉన్నారని యాంకర్ ప్రశ్నించగా.. ఏడాది నుంచి ఏడాదిన్నర మాత్రమే తాము బంధాన్ని కొనసాగించామని వరుణ్ సందేశ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. వరుణ్ సందేశ్‌తో రిలేషన్‌లో ఉన్న ఆ నటి ఎవరు? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Read more about: varun sandesh happy days
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X