పవన్ కల్యాణ్‌కు అవసరం లేదేమో.. పెదనాన్నతో అన్ని చెప్పుకోలేం కదా.. వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, అదితి రావ్ హైదరీ, లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌ల్లో సంక‌ల్ప్ రెడ్డి తెర‌కెక్కించిన చిత్రం అంత‌రిక్షం 9000 kmph. ఇప్ప‌టికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్ యు స‌ర్టిఫికేట్ అందుకుంది. డిసెంబ‌ర్ 21 రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఫిదా, తొలి ప్రేమ హిట్ల తర్వాత వస్తున్న ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ అంతరిక్షం సినిమా గురించి పలు విషయాలు వెల్లడించారు. వరుణ్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

హ్యాట్రిక్ హిట్టు గురించి

హ్యాట్రిక్ హిట్టు గురించి

ఫిదా, తొలి ప్రేమ తర్వాత అంతరిక్షం వస్తున్న చిత్రం కావడంతో చాలా టెన్షన్‌గా ఉంది. హ్యాట్రిక్ హిట్టు అనే విషయం నా మైండ్ లేదు. నా మూడో హిట్టు అనే విషయాన్ని పట్టించుకోలేదు. కానీ మంచి సినిమా చేశాననే ఫీలింగ్ మాత్రం ఉంది.

కథ నచ్చే చేశాను

కథ నచ్చే చేశాను

అంతరిక్షం కథను పూర్తిగా కాకపోయినా ఓ మోస్తారు స్టోరిని చెప్పారు. అప్పడే నాకు బాగా నచ్చింది. ఇది కమర్షియల్ సినిమానా? లేదా అనే ఆలోచించను. ఏ సినిమా అయితే అందరికి నచ్చుతుందో అదే కమర్షియల్ సినిమా అని నమ్ముతాను. అంతరిక్షం సినిమా అందరికి నచ్చే కమర్షియల్ సినిమా అవుతుంది.

ట్రాయాంగిల్ లవ్ స్టోరి కాదు

ట్రాయాంగిల్ లవ్ స్టోరి కాదు

అంతరిక్షం సినిమా ట్రాయాంగిల్ లవ్ స్టోరి కాదు. కానీ కథలో అది చిన్న పాయింట్ మాత్రమే. సైటింస్ట్ అయినా, దొంగ అయినా వ్యక్తిగత జీవితం ఉంటుంది. పార్వతి (లావణ్య త్రిపాఠి) అనే పాత్ర కథకు డ్రైవింగ్ ఫోర్స్‌గా ఉంటాయి. లావణ్య త్రిపాఠి తీసుకోవడం టీమ్ నిర్ణయం. ఆమె ట్రాక్ రికార్డు బాగాలేదు. ఫ్లాప్‌లు ఉన్నాయనే విషయాన్ని పట్టించుకోలేదు.

వెంకటేష్‌ మా పెదనాన్న లాంటి వారు

వెంకటేష్‌ మా పెదనాన్న లాంటి వారు

ఎఫ్‌2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) సినిమాలో వెంకటేష్ లాంటి అనుభవం ఉన్న నటుడితో నటించడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. పెదనాన్న స్టేచర్ ఉన్న నటుడు ఫ్రెండ్‌గా ఉంటే ఎలా ఉంటాడో వెంకటేష్ అలా ఉన్నాడు. కొన్ని విషయాలు పెదనాన్నతో చెప్పుకోలేం. కానీ వెంకటేష్ అన్ని చెప్పుకోవచ్చు. అలాంటి మంచి వ్యక్తి ఆయన. వెంకటేష్‌కు పవన్ కల్యాణ్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

మా అవసరం లేదనుకొంటాను

మా అవసరం లేదనుకొంటాను

పవన్ కల్యాణ్ జనసేనతో ప్రజల్లోకి వెళ్లారు. బాబాయ్ అనుకొన్న పనిని ఇష్టంగా చేస్తున్నారు. మేము ప్రస్తుతం జనసేనకు దూరంగా ఉన్నాం. ఆయన ఒక్కరే ప్రజలకు చేరువవుతున్నారు. మమ్మల్ని రమ్మని అడుగలేదు. మేము వస్తామని చెప్పలేదు. ఒకవేళ పిలిస్తే మేము వెళ్లడానికి రెడీ. ప్రస్తుతం మా అవసరం బాబాయ్‌కు లేదనిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X