అంతరిక్షం సెట్‌లో చిన్నపిల్లలు.. ఆకట్టుకుంటున్న వరుణ్, లావణ్య!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఘాజి ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శత్వంలో రూపొందుతున్న అంతరిక్షం చిత్రం చివరి దశకు చేరుకుంది. స్పేస్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రానికి డిసెంబర్ 21 విడుదల చేయనున్నారు.
చిత్ర యూనిట్ తాజగా విడుదల చేసిన షూటింగ్ లొకేషన్ లోని ఫోటో నెటిజన్లని ఆకట్టుకుంటోంది. చిన్న పిల్లలతో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఉన్నారు. అదితిరావు హైదరి ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఘాజి చిత్రం విజయం సాధించిన తరువాత సంకల్ప్ రెడ్డి, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో సినీ వర్గాలంతా దీని గురించి చర్చించుకుంటున్నారు.

వరుణ్ తేజ్ నటిస్తున్న మరో చిత్రం ఎఫ్2. వెంకటేష్, వరుణ్ కలసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రంపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఆగష్టు 15 సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. వరుణ్ తేజ్ ఈ చిత్రంలో వ్యూమగామిగా కనిపించబోతున్నాడు.


Click it and Unblock the Notifications











