Happy Birthday Varun Tej: ఆర్థిక కష్టాల్లో నుంచి ఫ్యామిలీని ఆదుకొన్న మెగా హీరో.. రెమ్యునరేషన్ ఎంతంటే?

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంత మంది స్టార్ హీరోలు ఉన్నా కూడా అందులో ఒక్కొకరికి ఒక్కరోజులో మార్కెట్ అయితే ఉంది. ఇక మెగా ఫ్యామిలీ నుంచి పరిచయమైన హీరోలందరూ కూడా వారికి ప్రత్యేకంగా ఇమేజ్ అయితే సంపాదించుకున్నారు. అయితే మెగా ఫ్యామిలీలో ఎవరు సక్సెస్ అయినా కాకపోయినా వరుణ్ తేజ్ మాత్రం సక్సెస్ అవ్వాలని చాలామంది కోరుతున్నారు. అనుకున్నట్లుగానే వరుణ్ తేజ్ భారీ స్థాయిలో మార్కెట్ క్రియేట్ చేసుకొని కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకునేల చేశాడు ప్రస్తుతం ఈ హీరో పారితోషకం ఎంత ఉంటుందో తెలిస్తే షాక్ అవుతారు. అంతే కాకుండా నేడు వరుణ్ 32వ పుట్టినరోజు కావడంతో ప్రత్యేకంగా విషెస్ అందిస్తున్నారు.

మెగా విషెస్..

నేడు వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా అనిల్ రావిపూడి ప్రత్యేకమైన పోలీస్ లుక్ ని విడుదల చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రత్యేకమైన ఫొటోను పోస్ట్ చేస్తూ విషెస్ తెలిపారు. నాగబాబు కూడా తల్లితో దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ ఎమోషనల్ గా విషెస్ అందించారు.

అతని కటౌట్ చూసి..

వరుణ్ తేజ్ మొదట ఒక సింపుల్ లవ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కొత్త బంగారులోకం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ముకుంద సినిమాతో హీరోగా పరిచయమైన వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ లోనే ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించాడు. అయితే ఆ సినిమా బాక్సాఫీసు వద్ద సరైన సక్సెస్ కాకపోయినప్పటికీ అతని కటౌట్ చూసి చాలామంది దర్శకులు సినిమాలు చేసేందుకు ముందుకు వచ్చారు.

తనకు తానే చాలా పాఠాలు నేర్చుకుంటూ..

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువ ఎత్తు కలిగిన హీరోలలో వరుణ్ టాప్ లో ఉన్నాడు. ప్రభాస్ రానా దగ్గుబాటి కంటే కూడా వరుణ్ తేజ్ హైట్ ఎక్కువ. కేవలం రొటీన్ కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా డిఫరెంట్ గా ట్రై చేస్తూ వరుణ్ తేజ్ తనకు తానే చాలా పాఠాలు నేర్చుకున్నాడు. మంచి బాక్సాఫీస్ హిట్స్ తో పాటు దారుణమైన ప్లాప్స్ కూడా చేశాడు.

వరుణ్ తేజ్ సపోర్ట్

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన లోఫర్ సినిమా కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఒకవైపు నాగబాబు ఆర్థికంగా మెల్లగా కుదురుకుంటున్న సమయంలో వరుణ్ తేజ్ సపోర్ట్ చాలా అవసరం అని వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా బలంగా కోరుకున్నారు. ఎందుకంటే నాగబాబుకు ఆరెంజ్ సినిమా నష్టాలను పూరించడానికి చాలా సమయం పట్టింది.

రెమ్యునరేషన్ ఎంతంటే?

రెమ్యునరేషన్ ఎంతంటే?

ఇక వరుణ్ తేజ్ మొత్తానికి ఫిదా సినిమాలో అయితే ఫామ్ లోకి వచ్చేశాడు. ఆ తరువాత వచ్చిన తొలిప్రేమ సినిమా కూడా తన మార్కెట్ను ఒక్కసారిగా పెంచేసింది. అలాగే మల్టీస్టారర్ F2 కామెడీ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల కలెక్షన్స్ అందుకోవడంతో వరుణ్ తేజ్ పారితోషికం కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం అతడు 10 కోట్ల నుంచి 12 కోట్ల మధ్యలో పారితోషకం అందుకున్నట్లు తెలుస్తోంది.

రాబోయే సినిమాలు..

రాబోయే సినిమాలు..

ఇక F3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వరుణ్ తేజ్ అలాగే బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో రానున్న గని సినిమాతో ఆకట్టుకోబోతున్నాడు. ఇక నేడు వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి నాగబాబు అనిల్ రావిపూడి వంటి వారు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందుకు సంబంధించిన ట్వీట్స్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X