Varun Tej: మెగా హీరో స్పీడ్‌కు బాలీవుడ్ షాక్.. రెండు రోజుల్లోనే 26 కంప్లీట్
మెగా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. హీరోగా పరిచయమైన కొత్తలోనే యాక్టింగ్, ఫైట్స్, డ్యాన్స్ ఇలా అన్ని విభాగాల్లో రాణించి.. చాలా తక్కువ సమయంలోనే ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. కెరీర్ ఆరంభం నుంచీ వైవిధ్యమైన చిత్రాలతో సందడి చేస్తోన్న అతడు.. ఎన్నో హిట్లను కూడా ఖాతాలో వేసుకున్నాడు. అయితే, అతడి గత చిత్రాలు మాత్రం ఆశించిన రీతిలో ఆడలేదు. అయినప్పటికీ వరుణ్ తేజ్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు.
వరుణ్ తేజ్ ప్రస్తుతం తన 13వ సినిమా 'ఆపరేషన్ వాలెంటైన్'ను శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో చేశాడు. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రాబోతున్న ఈ చిత్రం ఎయిర్‌ఫోర్స్ వార్ బ్యాగ్‌డ్రాప్‌తో తెరకెక్కింది. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తైంది. దీంతో ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలోనే విడుదల చేయాలని భావించారు. కానీ, అనివార్య కారణాలతో ఈ చిత్రాన్ని మార్చి 1వ తేదీకి వాయిదా వేసేశారు. దీంతో ఇప్పుడు మూవీ యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టేసింది.

వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ రూపొందిస్తోన్న 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో ప్రమోషన్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలు శరవేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగానే వరుణ్ తేజ్ ఇప్పుడు ముంబైలో పర్యటిస్తున్నాడు. అక్కడ అతడు రెండు రోజుల వ్యవధిలోనే ఏకంగా 26 ఇంటర్వ్యూలను కంప్లీట్ చేసుకున్నాడు. దీంతో అతడి పేరు ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా మారుమ్రోగిపోతోంది.

ఇదిలా ఉండగా.. వరుణ్ తేజ్- శక్తి ప్రతాప్ సింగ్ హడా కలయికలో రాబోతున్న 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీని సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ రినైసెన్స్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. దీన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందించారు. ఇందులో 2017 మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి వచ్చిన ప్రచార చిత్రాలకు భారీ రెస్పాన్స్ వస్తోంది.


Click it and Unblock the Notifications











