For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వెరీ ఇంట్రెస్టింగ్: విజయ్ - పూరీ సినిమా కథలో మార్పులు.. కారణం ఈ మెగా హీరోనే

  By Manoj Kumar P
  |

  టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ.. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. పూరీ సొంత బ్యానర్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా అనుకున్నప్పటి నుంచి ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ సినిమాలో పలానా హీరోయిన్ నటిస్తుందని, ఇందులో విజయ్ డిఫరెంట్ పాత్రలో నటిస్తున్నాడని.. ఇలా ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా ఈ సినిమా కథలో మార్పులు చేస్తున్నాడట దర్శకుడు పూరీ జగన్నాథ్. దీనికి కారణం మెగా హీరోనేనట. వివరాల్లోకి వెళితే..

  మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో మూవీ

  మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో మూవీ

  పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ అంటే ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టేసుకుంటారు. ఇందుకు అనుగుణంగానే దర్శకుడు అదిరిపోయే స్క్రిప్టును రెడీ చేశాడట. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా తెరకెక్కబోతుందని ప్రచారం జరుగుతోంది. అందుకే ఈ సినిమాకు ‘ఫైటర్' అని టైటిల్ కూడా రిజిష్టర్ చేయించేశాడట పూరీ జగన్నాథ్.

  విజయ్ నుంచి ఇవి ఊహించరు

  విజయ్ నుంచి ఇవి ఊహించరు

  ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఫైటర్‌గా కనిపిస్తాడన్నది తెలిసిందే. అందుకోసమే అతడు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటున్నాడని అంటున్నారు. అలాగే, ఈ సినిమా కోసం విజయ్ సిక్స్ ప్యాక్ చూపించబోతున్నాడట. అంతేకాదు, ఈ సినిమాలో అతడు మాటలు సరిగా పలకలేని వ్యక్తిగా కనిపిస్తాడని టాక్.

  హీరోయిన్ విషయంలో నో క్లారిటీ

  హీరోయిన్ విషయంలో నో క్లారిటీ

  ఈ సినిమాలో నటించే హీరోయిన్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. మొదట ఇందులో శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటిస్తుందని అన్నారు. ఆ తర్వాత కియారా అద్వాణీని తీసుకుంటున్నారని ప్రచారం జరిగింది. వీళ్ల తర్వాత కొంత మంది పేర్లు తెరపైకి వచ్చాయి కానీ, ఎవరినీ ఫైనల్ చేయలేదు. దీంతో విజయ్ సరసన ఎవరు నటిస్తారన్నది సస్పెన్స్‌గా మారింది.

  కథలో మార్పులు

  కథలో మార్పులు

  విజయ్ దేవరకొండకు పూరీ జగన్నాథ్ చెప్పిన కథలో ప్రస్తుతం మార్పులు చేస్తున్నట్లు తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. వాస్తవానికి స్క్రిప్ట్ చేంజ్ చేయాలని విజయ్.. పూరీకి సూచించాడని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే, అందులో నిజం లేదని తాజాగా ఫిలింనగర్ ఏరియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

  Arjun Suravaram Movie Review | Samantha In Family Man Season 2
  ఈ నిర్ణయానికి మెగా హీరోనే కారణం

  ఈ నిర్ణయానికి మెగా హీరోనే కారణం

  కథలో మార్పులు చేయాలనుకున్న దానికి మెగా హీరోనే కారణం అని కూడా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ‘గద్దలకొండ గణేష్' వంటి హిట్ సినిమా తర్వాత వరుణ్ తేజ్.. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది బాక్సింగ్ నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమా.. పూరీ తెరకెక్కించేది ఒకే లైన్‌తో వస్తున్నాయట. అందుకే పూరీ కథను మారుస్తున్నాడని సమాచారం.

  English summary
  Vijay Devarakonda’s career graph skyrocketed with Arjun Reddy. The film was a massive success and he went on to become the hottest star in Tollywood. According to the latest buzz doing rounds, veteran filmmaker Puri Jagannath is planning to make a film with Vijay Devarakonda.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more