twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాలిడే ఎంజాయ్ చేస్తున్న వరుణ్ తేజ్, ఇప్పుడెక్కడున్నాడో తెలుసా?

    |

    మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో 'వాల్మీకి' చిత్రం చేస్తున్నారు. షూటింగ్ షెడ్యూల్ మధ్య కాస్త విరామం దొరకడంతో వేసవి తాపం నుంచి రిలాక్స్ అయ్యేందుకు నెదర్లాండ్ వెకేషన్ వెళ్లారు. ఆమ్‌స్టర్‌డాంలో హాలిడే ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుపుతూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో షేర్ చేశారు.

    హాలిడే పిక్‌లో వరుణ్ తేజ్ గడ్డంతో రగ్గ్‌డ్ లుక్‌తో సరికొత్తగా కనిపించారు. 'వాల్మీకి' చిత్రంలో కూడా ఈ మెగా హీరో ఇలాంటి అవతారంలోనే కనిపించబోతున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారట.

    Varun Tej enjoying holiday in Amsterdam

    బాక్సర్ పాత్రలో వరుణ్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా టైటిల్ తగిన విధంగానే ఈ మూవీలో అతడి పాత్ర మొదట నెగెటివ్ షేడ్స్ ఉన్నప్పటికీ కథ సాగే క్రమంలో క్యారెక్టర్లో మార్పు వస్తుందని, ఆసక్తికర స్క్రీన్ ప్లే జోడించి హరీష్ శంకర్ సినిమా రక్తికట్టించే విధంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

    తమిళంలో సూపర్ హిట్ అయిన 'జిగర్తాండ' చిత్రానికి రీమేక్‌గా 'వాల్మీకి' తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమెను 15 రోజుల కాల్షీట్లు అడిగితే రూ. 2 కోట్లు డిమాండ్ చేసిందట. మరి ఈ కన్నడ బ్యూటీని ఫైనలైజ్ చేశారా? లేదా? అనే విషయంలో అఫీషియల్ సమాచారం వెలువడాల్సి ఉంది.

    'ఎఫ్ 2' విజయం తర్వాత వరుణ్ తేజ్ క్రేజ్ మరింత పెరిగింది. అందుకు తగిన విధంగానే 'వాల్మీకి' చిత్రాన్ని 14 రీల్స్ బ్యానర్‌లో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట భారీ స్థాయిలోనిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

    కాగా.. వరుణ్ తేజ్ తన కెరీర్లో తొలిసారిగా ఒక హాలీవుడ్ చిత్రానికి వాయిస్ అందిస్తున్నారు. డిస్నీ సంస్థ నిర్మించి 'అలాడిన్' తెలుగు వెర్షన్‌లో హీరో పాత్రకు వరుణ్ తేజ్ వాయిస్ అందిస్తుండగా, జీనీ దెయ్యం పాత్రకు వెంకీ డబ్బింగ్ చెప్పారు. ఈ చిత్రం ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    English summary
    Mega Prince Varun Tej flew to Netherlands for a short holiday. A candid click from his holiday is posted by Varun Tej on his Instagram handle. Varun Tej is an Indian film actor known for his works in Telugu Cinema. He made his debut as a lead in the film Mukunda, directed by Srikanth Addala opposite Pooja Hegde.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X