ఆ సమయం కోసం ఎదురుచూస్తున్నా.. దీర్థాలోచనలో పడ్డ వరుణ్ తేజ్

ప్రస్తుతం ఎంతటి పెద్ద వారైనా సరే ఇంటి పట్టునే ఉండాలి. ఉండక తప్పని పరిస్థితి ఏర్పడింది. కరోనా విలయతాండవం చేస్తుండగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మరీ దిగజారిపోయింది. రోజుకు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా దెబ్బకు ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించకపోయినా ఎవరికి వారే స్వచ్చందంగా లాక్ డౌన్ విధించుకుంటున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం మనం ఉన్నామో అందరికీ తెలిసి వచ్చింది. ఇలాంటి సమయంలో మంచి రోజుల కోసం ఎదరుచూడటమే తప్పా ఇంకేమీ చేయలేని స్థితిలో ఉన్నాం.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. లాక్ డౌన్ విధించిన దగ్గరి నుంచి ఇంటి పట్టునే ఉంటూ తన పని తాను చేసుకుంటూపోతున్నాడు. బాక్సర్ సినిమా కోసం సన్నమద్దమవుతున్నాడు. ఇంట్లోనే రోజూ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఫిట్ నెస్‌నూ మెయింటైన్ చేస్తున్నాడు. మధ్య మధ్యలో అలా కరోనాపై, ప్రస్తుత పరిస్థితిపై సెటైర్స్ వేస్తుంటాడు. ఆ మధ్య 2020 ఎలా ఉందో చెప్పుకుంటూ గతంలో దిగిన ఓ బ్లర్డ్ ఫోటోను షేర్ చేశాడు.

Varun Tej Is waiting for the world to come back to normalcy

ఇంట్లో ఉండి ఉండి వరుణ్ తేజ్‌కు బోర్ కొట్టినట్టు అనిపిస్తోంది. మళ్లీ సాధారణ పరిస్థితులు ఎప్పుడు నెలకొంటాయో, ప్రపంచంగా మునుపటిలా ఎప్పుడు ఉంటుందో, ఆ సమయం ఎప్పుడు వస్తుందో అని దీర్ఘాలోచన చేస్తున్నాడు. ఈ మేరకు వరుణ్ తేజ్ షేర్ చేసిన ఫోటో తెగ వైరల్ అవుతోంది. వరుణ్ ప్రస్తుతం బాక్సర్ సినిమా కోసం కష్టపడుతున్నాడు. లాక్ డౌన్‌కు ముందే.. వైజాగ్‌లో ఓ వారం రోజుల పాటు షూటింగ్ కూడా చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X