Ghani: వావ్.. వరుణ్ తేజ్ హై వోల్టేజ్ బాడీ.. బాక్సాఫీస్ బ్లాస్ట్ అవ్వడం పక్కా!

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన యువ హీరోలు కూడా ఎవరికి వారు ప్రత్యేకంగా ఒక క్రేజ్ అయితే అందుకున్నారు. సొంతంగా మార్కెట్ సెట్ చేసుకొని సరికొత్తగా ప్రయోగాలు చేస్తున్నారు. అయితే అందరూ ఒకలా ఉంటే వరుణ్ తేజ్ మాత్రం కాస్త విబిన్నంగా అడుగులు వేస్తున్నారు. సినిమా సినిమాకు తనను తాను చాలా కొత్తగా ప్రజెంట్ చేసుకుంటున్నాడు. తొలిప్రేమ సినిమా నుంచి కూడా వరుణ్ తేజ్ స్టోరీ సెలక్షన్ చాలా విబిన్నంగా ఉంటోంది.

ఇక ఫిదా సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు. అనంతరం గడ్డలకొండ గణేష్ అంటూ మరో ఊర మాస్ సినిమా చేశాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా మంచి వసూళ్లను అందుకుంది. ఇక ఈసారి 'గని' సినిమాతో రాబోతున్న వరుణ్ ఒక బాక్సర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఆ సినిమా కోసం వరుణ్ నెవ్వర్ బిఫోర్ అనేలా కష్టపడుతున్నాడు. ఇప్పటివరకు వరుణ్ ను ఎవరు కూడా అతని బాడీకి తగ్గట్లుగా యూజ్ చేసుకోలేదు. ఇక గని సినిమాలో మాత్రం వరుణ్ హై వోల్టేజ్ లాంటి బాడీతో దర్శనం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

 Varun tej latest workout video viral for ghani movie

రీసెంట్ గా వరుణ్ ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ చేశాడు. అందులో తన వ్యాయామం చేస్తున్న విధానం చూస్తుంటే ఈసారి బాక్సాఫీస్ బ్లాస్ట్ అవ్వడం పక్కా అనిపిస్తోంది. గని లోడింగ్ అనే ట్యాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తుండగా అల్లు అరవింద్ పెద్ద కుమారుడు బాబీ నిర్మిస్తున్నారు. గని సినిమాలో స్టార్ క్యాస్ట్ కూడా బాలంగా ఉంది. ఉపేంద్ర, జగపతిబాబు, సునీల్ శెట్టి వంటి విబిన్నమైన టాలెంటెడ్ స్టార్స్ స్పెషల్ పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల సినిమాకు సంబంధించిన ఓటీటీ శాటిలైట్ హక్కులను ఆహా 24కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. శాటిలైట్ హక్కులను ఆహా త్వరలోనే మరో ఛానెల్ కు అమ్మనుంది. అలగ్వ వరుణ్ తేజ్ త్వరలోనే ఒక బాలీవుడ్ సినిమా కూడా చేయనున్నట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X