Don't Miss!
- News ఏపీకి మరో వరం ప్రకటించిన మోడీ
- Sports T20 World Cup: ఆ కుర్రాడికి టికెట్ కన్ఫార్మ్- సెహ్వాగ్
- Finance Railway News: రైలు ప్రయాణికులకు శుభవార్త..! టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు తగ్గింపు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
అదిరిపోయే లుక్ లో మెగా ప్రిన్స్.. గత్తర్ లేపినవ్ పో అంటున్న ఫ్యాన్స్
మెగా ఫ్యామిలీలో తన కంటూ భిన్నమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. మొదట్నుంచీ విభిన్న కథలను ఎంచుకుంటూ.. ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. మాస్ మంత్రం జపించకుండా.. కథలో వైవిధ్యముండే సినిమాలను ఎంచుకుంటూ మెగా అభిమానులను మెప్పిస్తున్నాడు.
వరుస హిట్స్ తో దూసుకుపోతున్న వరుణ్.. ఈ ఏడాది సంక్రాంతికి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఎఫ్2 మూవీలో తెలంగాణ యాసతో అదరగొట్టగా... తాజాగా గద్దలకొండ గణేష్ అంటూ మరోసారి దుమ్ములేపాడు. నెగెటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్రను పోషించి.. నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. ఈ సినిమాలో తన పాత్రే హైలెట్ కావడంతో.. సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
ముఖ్యంగా వరుణ్ గెటప్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. గడ్డం, మీసం కట్టుతో తన గెటప్ మార్చుకుని పాత్రను మరింత పండించాడు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే గెటప్ లో కూడా వరుణ్ ఆకట్టుకున్నాడు. ఇక వరుణ్ తాజాగా కొత్త లుక్లో కనిపిస్తున్నాడు. అయితే ఇది తదుపరి చిత్రం కోసమే అయి ఉంటుందని అభిమానులు అంటున్నారు.
ప్రొవోక్ మ్యాగజైన్ మీద అదిరిపోయే లుక్ లో కనిపించి వరుణ్ తన అభిమానులకు కనువిందు చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మరి ఈ మ్యాగజైన్ ఎలా బుక్ చేసుకోవాలో కూడా చెప్పేశాడు. మరింకెందుకు ఆలస్యం.. వరుణ్ చెప్పిన సంగతులేంటో తెలుసుకోడానికి మ్యాగజైన్ ను బుక్ చేసుకోండి.