చెల్లెళ్ళతో వరుణ్ తేజ్ రాఖి సెలెబ్రేషన్స్!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస చిత్రాలతో కెరీర్ లో బిజీగా ఉన్నాడు. వరుణ్ తేజ్ ప్రస్తుతం అంతరిక్షం, ఎఫ్ 2 చిత్రాలతో బిజీగా గడుపుతున్నాడు. ఫిదా, తొలిప్రేమ చిత్రాలతో వరుణ్ తేజ్ దర్శకులకు క్రేజీ హీరోగా మారిపోయాడు. కాగా నేడు రక్షాబంధన్ పురస్కరించుకుని వరుణ్ తేజ్ తన అక్కా చెల్లెళ్ళతో సరదాగా గడిపాడు.
వరుణ్ తేజ్ కు నిహారిక రాఖి కట్టింది. వరుణ్ తేజ్ రాఖి సెలెబ్రేట్ చేసుకున్న ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అన్నా చెల్లెళ్ల భందం చాలా ప్రత్యేకమైనదని వరుణ్ తేజ్ కామెంట్ చేశాడు. సినిమాల విషయానికి వస్తే వరుణ్ తేజ్ నటిస్తున్న అంతరిక్షం చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఈ చిత్రం ఘాజి దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మల్టీస్టారర్ గా రూపొందుతున్న ఎఫ్ 2 చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్ కలసి నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు.


Click it and Unblock the Notifications











