twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘తొలిప్రేమ’ కాంబినేషన్ మళ్లీ రిపీట్.. దర్శకుడి ట్వీట్‌పై హీరో రియాక్షన్

    |

    వెంకీ అట్లూరి, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబోలో వచ్చిన చిత్రం తొలిప్రేమ. వరుణ్ తేజ్‌కు మరుపురాని చిత్రంగా మిగిలిపోయింది తొలిప్రేమ. అసలే మెగా ఫ్యామిలీకి తొలిప్రేమ అంటే ఎంతో విశిష్టమైంది. పవన్ కళ్యాణ్ చిత్రాల్లో చెప్పుకోదగ్గ వాటిల్లో తొలిప్రేమ ఒకటి. ఆ టైటిల్‌తో వరుణ్ తేజ్ చేసిన సినిమా కూడా సక్సెస్ కావడం అందరిలోనూ ఆనందాన్ని నింపింది. తొలిప్రేమ రిలీజై నేటికి మూడేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ అట్లూరి నాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు.

    వెంకీ అట్లూరికి దర్శకుడిగా తొలిప్రేమ మొదటి చిత్రం కావడంతో అది ఎంతో స్పెషల్‌గా నిలిచిపోయింది. అందుకే మొదటి రోజు షూటింగ్ ఎలా గడిచిందో చెప్పుకొచ్చాడు. ఈ మేరకు వెంకీ అట్లూరి ట్వీట్ చేస్తూ.. 'ఆ ఏడాది ఇదే రోజు.. నా కల నిజమైంది.. తొలిప్రేమ మొదటి రోజు షూటింగ్ నాకు ఎప్పటికీ ప్రత్యేకమే. నన్ను నమ్మినందుకు నా బ్రదర్, హీరో వరుణ్ తేజ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. రాశీ ఖన్నా, డీఓపీ జార్జ్, తమన్, నిర్మాత, ఎడిటర్, చిత్ర యూనిట్ అందరికీ ధన్యవాదాల'ని పేర్కొన్నాడు.

    Varun Tej Reaction To Venky Atluri About 3 Years Of Tholi Prema

    ఇక దర్శకుడు ఇంత ఎమోషనల్ అయితే హీరో ఊరుకుంటాడా? వెంటనే రియాక్ట్ అవ్వడూ. వరుణ్ తేజ్ వెంకీకి రిప్లై ఇస్తూ.. మనం మరో డేట్‌కు ఇలా త్వరలోనే మార్క్ చేసుకుందాం అంటూ చెప్పుకొచ్చాడు. అయితే వీరిద్దరూ త్వరలోనే కలిసి పని చేసేందుకు రెడీ అవుతున్నారన్న మాటే. అయితే ప్రస్తుతం వెంకీ అట్లూరి నితిన్-కీర్తి సురేష్ రంగ్ దేతో బిజీగా ఉన్నాడు. ఇటు వరుణ్ తేజ్ బాక్సర్ చిత్రం కోసం సన్నద్దమవుతున్నాడు. ఇప్పటికే వారం రోజులు షూటింగ్ చేసిన సంగతి తెలిసిందే.

    English summary
    Varun Tej Reaction To Venky Atluri About 3 Years Of Tholi Prema. This day, that year, my dream became a reality. The first-day shoot of #Tholiprema is forever special. My heartful thanks to my hero & brother
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X