అంతరిక్షం ప్రీరిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే.. చీఫ్ గెస్ట్ విషయంలో సందిగ్దత!

మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం అంతరిక్షం. ఘాజి చిత్రంతో అబ్బురపరిచిన సంకల్ప్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. స్పేస్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింతగా అంచనాలు పెంచేసింది. డిసెంబర్ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేస్తున్నారు.

డిసెంబర్ 18న హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెక్షన్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కు హాజరయ్యే చీఫ్ గెస్ట్ విషయంలో సందిగ్ధత నెలకొనివుంది. చిరు, పవన్ హాజరవుతారు అంటూ ఇటీవల వార్తలు వినిపించాయి. కానీ చిత్ర యూనిట్ మాత్రం ఈ విషయాన్ని ఖరారు చేయలేదు.

Varun Tejs Antariksham prerelease event date fixed

వరుణ్ తేజ్, అదితి రావు హైదరి ఈ చిత్రంలో వ్యోమగాములుగా నటిస్తున్నారు. లావణ్య త్రిపాఠి వరుణ్ ప్రేయసిగా నటిస్తోంది. అద్భుతమైన విజువల్స్ తో ఉత్కంఠ రేకెత్తించే స్పేస్ సన్నివేశాలతో ఈ చిత్రం మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వరుణ్ తేజ్ తన కెరీర్ లో విభిన్నమైన చిత్రాలు చేస్తూ ఒక్కో మెట్టు ఎదుగుతున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X