వైరల్ ఫోటో.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన వరుణ్ తేజ్.. 'వాల్మీకి' లుక్!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎఫ్2 చిత్రంతో ఈ ఏడాది ఆరంభంలోనే ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాడు. వరుణ్ తేజ్ ప్రతి చిత్రంలో తనదైన శైలిలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రశంసలు దక్కించుకుంటున్నాడు. కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు పొందిన హరీష్ శంకర్ దర్శత్వంలో వరుణ్ తేజ్ వాల్మీకి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ చిత్రం జిగర్తాండకు ఇది రీమేక్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నెగిటివ్ షేడ్స్ ఉండే పాత్రలో నటిస్తున్నాడు.
వాల్మీకి చిత్రాల్లో వరుణ్ తేజ్ లుక్ తాజాగా బయట పడింది. వరుణ్ తేజ్ షూటింగ్ లొకేషన్ లో ఉన్న ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గుబురుగా గడ్డం.. బాగా పెరిగి రింగులు తిరిగిన హెయిర్ తో వరుణ్ తేజ్ షాకింగ్ లుక్ లో కనిపిస్తున్నాడు. తమిళ చిత్రం జిగర్తాండలో బాబీ సింహ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. బాబీ సింహా నటనకు ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం అదే పాత్రని వరుణ్ తేజ్ పోషిస్తున్నాడు. కానీ హరీష్ శంకర్ ఒరిజినల్ కథలో తెలుగువారికి అనుగుణంగా కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

తమిళ నటుడు అధర్వ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించనున్నాడు. సోషల్ మీడియాలో ఫేమస్ అయిన తమిళ బ్యూటీ మృణాళిని హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ కెరీర్ ఆరంభం నుంచి నటనపై, తన పాత్రలపైనే దృష్టిపెడుతున్నాడు. వాల్మీకి చిత్రంలో వరుణ్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడో వేచిచూడాలి.


Click it and Unblock the Notifications











