twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యాక్టింగ్ ఇక్కడే నేర్చుకున్నా, వెంకీగారితో చేయడం గౌరవంగా భావిస్తున్నా: వరుణ్ తేజ్

    |

    విక్టరీ వెంకటేశ్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ హీరోలుగా తమన్నా, మెహరీన్‌ హీరోయిన్స్‌గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మించిన 'ఎఫ్‌ 2- ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌' ఆడియో రిలీజ్ వేడుక విశాఖపట్నంలో జరిగింది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన పాటలను ఆర్‌.కె.బీచ్‌లో జరిగిన విశాఖ ఉత్సవంలో విడుదల చేశారు. ఆడియో సీడీలను ఆంధ్రప్రదేశ్‌ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు విడుదల చేశారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    Poll: 2018 ఉత్తమ తెలుగు చిత్రంPoll: 2018 ఉత్తమ తెలుగు చిత్రం

    ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ... వైజాగ్ నాకు చాలా క్లోజ్. నేను యాక్టింగ్ ఇక్కడే జగదాంబ థియేటర్ సమీపంలోని సత్యానంద్ ఇనిస్టిట్యూట్‌లో నేర్చుకున్నాను. ఇక్కడి నుంచే నా కెరీర్ మొదలైంది. విశాఖ ఉత్సవంలో మా సినిమా ఆడియో రిలీజ్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇదంతా జరుగడానికి కారణం గంటా శ్రీనివాసరావుగారు, మా ఫ్యామిలీకి చాలా క్లోజ్. సినిమా ఫంక్షన్లు అంటే ఆయన తప్పకుండా తన సహకారం అందిస్తారు.

    Varun Tej Speech At F2 Vizag Audio Launch

    ఈ రోజు హీరో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్. ఆయనతో కలిసి ఫస్ట్ టైం చేస్తున్నాను. మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆయనతో త్వరలోనే మరో సినిమా చేస్తానని ఆశిస్తున్నాను. లిరిక్స్ రాసిన వారికి, పాడిన సింగర్లు, ఇతర ఆర్టిస్టులందరికీ ప్రత్యేకంగా థాంక్స్. ముందు అనిల్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. నేను చేసిన మిగతా సినిమాలు చూస్తే వేరేవారైతే ఈ క్యారెక్టర్ నాకు ఇవ్వరేమో...కానీ అనిల్ ధైర్యం చేసి ఇచ్చాడు. మేనేజ్ చేసి బాగానే చేశా. మీకు నచ్చుతుందని నమ్ముతున్నాను.

    ఇక్కడ విక్టరీ వెంకటేష్ గారి గురించి ముఖ్యంగా మాట్లాడాలి... ఆయనతో పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను. ఒక ఫ్రెండుగా, మెంటర్ లాగా నన్ను సపోర్టు చేశారు. ఆయనతో జర్నీ చాలా సాఫీగా సాగింది. జనవరి 12 సంక్రాంతికి మేము అల్లుళ్లుగా వస్తున్నాం. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను అని వరుణ్ తేజ్ తెలిపారు.

    English summary
    Varun Tej Speech At F2 Vizag Audio Launch . F2 Fun and Frustration Movie Audio Launch event at Visakhapatnam. Venkatesh, Varun Tej, Ganta Srinivasa Rao, Anil Ravipudi, Dil Raju, Satyam Rajesh, Hari Teja, Devi Sri Prasad, Sri Mani, Kasarla Shyam, Hariharasudhan, Suma at the event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X