Just In
- just now
Box office: ఇదే ఆఖరి రోజు.. ఆ ఇద్దరికి తప్పితే అందరికి లాభాలే, టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?
- 1 hr ago
Happy Birthday Ravi Teja: కష్టాన్ని నమ్ముకొని వేల రూపాయల నుంచి 50కోట్లకు చేరుకున్న హీరో
- 2 hrs ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరి కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
- 3 hrs ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్‌పోజింగ్‌తో చంపేసిందిగా..
Don't Miss!
- Sports
పంత్ 2.O: 4 నెలల్లో 10 కిలోలు తగ్గి.. గేమ్, మైండ్‌సెట్ మార్చుకున్న రిషభ్!
- News
Prabhas: బాహుబలి బిస్కేట్ రూ. 10 వేలు, స్కెచ్ అదిరింది, విదేశాల్లో షూటింగ్, చివరికి చాట మిగిలింది!
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
శుభవార్త చెప్పిన మెగా హీరో: ఇంత ఆనందాన్ని ఇస్తుందనుకోలేదు అంటూ ట్వీట్
బడా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. సినిమా సినిమాకు వైవిధ్యాన్ని చూపుతూ సూపర్ సక్సెస్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. దీంతో స్టార్ హీరోగా ఎదగడంతో పాటు మార్కెట్‌ను కూడా గణనీయంగా పెంచుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల వరుణ్ తేజ్ కరోనా వైరస్ బారిన పడ్డాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన అతడు.. తనకు కొన్ని లక్షణాలు కూడా ఉన్నాయని తెలిపాడు.
కొద్ది రోజుల క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కరోనా పాజిటివ్‌గా తేలాడు. ఆ వెంటనే వరుణ్ కూడా తనకు కరోనా వచ్చినట్లు చెప్పి.. అప్పటి నుంచి సెల్ఫ్ క్యారంటైన్‌లో ఉంటున్నాడు. దీనికి సంబంధించిన అనుభవాలను వివరిస్తూ అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నాడు. ఈ నేపథ్యంలో తనకు కరోనా టెస్టులో నెగటివ్ రిపోర్ట్ వచ్చినట్లు తాజాగా ఓ ట్వీట్ చేశాడు వరుణ్. అంతేకాదు, 'నేనెప్పుడూ ఓ నెగటివ్ రిపోర్టు మనకు ఆనందాన్ని పంచుతుందని అనుకోలేదు' అంటూ ఫన్నీగా రాసుకొచ్చాడు. దీంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం వరుణ్ తేజ్.. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో ఉన్న సినిమాలో నటిస్తున్నాడు. ఇది ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా.. కరోనా లాక్‌డౌన్ వల్ల ఆలస్యం అయింది. ఇది పట్టాలపై ఉండగానే.. 'F3'లో నటిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మూవీ 'F2'. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ నటించిన ఈ మల్టీ స్టారర్ మూవీని సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. దిల్ రాజు నిర్మించిన 'F2' భారీ వసూళ్లను రాబట్టి సంక్రాంతి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.