వరుణ్ తేజ్ సినిమా క్యాన్సిల్ అవ్వలేదు.. క్లారిటీ ఇచ్చిన యువ దర్శకుడు!

మెగా యువ హీరో వరుణ్ తేజ్ మెల్లమెల్లగా స్టార్ హీరోల రేంజ్ కి ఎదుగుతున్నాడు. డిఫరెంట్ కథలను ఎంచుకుంటు అన్ని వర్గాల ఆడియెన్స్ కి దగ్గరవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తొలి ప్రేమ, ఫిదా వంటి సినిమాలు వరుణ్ కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చాయి. అంతకుముందు వరకు వరుస డిజాస్టర్స్ తో కొంత ఇబ్బంది పడిన విషయం తెలిసిందే.

చివరగా వచ్చిన F2 అలాగే గద్దల కొండ గణేష్ సినిమాలు కూడా వరుణ్ కి మంచి క్రేజ్ ని అందించాయి. మొత్తనికి సక్సెస్ ట్రాక్ లో నడుస్తున్న వరుణ్ పై ఇటీవల వచ్చి కొన్ని రూమర్స్ మెగా అభిమానులను కాస్త కన్ఫ్యూజన్ కి గురి చేశాయి. వరుణ్ స్టార్ట్ చేసిన ఒక యాక్షన్ సినిమా క్యాన్సిల్ అయ్యిందని వరుణ్ తేజ్ రెమ్యునరేషన్ కూడా వెనక్కి ఇచ్చేసినట్లు టాక్ వచ్చింది.

varun tej upcoming project boxer movie latest update

ఆ సినిమా మరేదో కాదు. బాక్సర్. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో సాగర్ చంద్ర దర్శకత్వంలో ఆ సినిమా రానున్నట్లు చాలా రోజుల క్రితమే ఎనౌన్స్ చేశారు. ఆ సినిమా కోసం వరుణ్ విదేశాలకు వెళ్లి బాక్సింగ్ కూడా నేర్చుకున్నాడు. కానీ సడన్ గా నిర్మాత ఆర్థిక కారణాల వల్ల క్యాన్సిల్ చేసినట్లు రూమర్స్ రాగా దర్శకుడు సాగర్ అవి అబద్దాలని కొట్టి పారేశాడు.

అందులో ఎలాంటి నిజం లేదని, ప్రస్తుతం సినిమా సెట్స్ పైనే ఉందని అంటూ వైరస్ తీవ్రత తగ్గిన తరువాత రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు వివరణ ఇచ్చారు. ఈ సినిమాతో పాటు సాగర్ చంద్ర ' అప్పట్లో ఒకడుండేవాడు' సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X