నేను ప్రేమించే నా మోస్ట్ ఫేవరెట్ వీరే: వరుణ్ తేజ్ ‘మెగా’ జ్ఞాపకం
మెగా ఫ్యామిలీకి మూలం మెగాస్టార్ చిరంజీవి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఆయన స్వయకృషితో పెద్ద సామ్రాజ్యాన్నే క్రియేట్ చేశారు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ టాలీవుడ్ నెం.1 పొజిషన్ అందుకున్నారు. మరి అలాంటి వ్యక్తితో ఏ చిన్న జ్ఞాపకం అయినా అపురూపమే!
చిరంజీవి వేసిన బాటలో ఇండస్ట్రీకి వచ్చిన హీరోల్లో మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ఒకరు. తాజాగా వరుణ్ తేజ్ తన చిన్ననాటి ఫోటో ఒకటి అభిమానులతో పంచుకున్నారు. నాన్న నాగబాబుతో పాటు పెదనాన్న చిరంజీవి, బాబాయ్ పవన్ కళ్యాణ్‌తో కలిసి ఉన్న ఈ పిక్ తనకు ఎంతో ప్రత్యేకమైనదని పేర్కొన్నారు.
'పాత ఫొటోలు వెతుకుతుండగా ఇది కనిపించింది. నా జీవితంలో ఎంతో ఇష్టమైన వ్యక్తులు వీరు. వారిని ఎంతో ప్రేమిస్తున్నా' అంటూ వరుణ్ తేజ్ ట్వీట్ చేశారు. వరుణ్ తేజ్ షేర్ చేసిన ఈ పిక్‌కు మెగా అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సామానిక మాధ్యమాల్లో మీడియాలో ఇది వైరల్ అవుతోంది.
వరుణ్ తేజ్ సినిమాల విషయానికొస్తే... 2019 సంవత్సరంలో 'ఎఫ్2-ఫన్ అండ్ ఫ్రస్టేషన్' మూవీతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ నమోదు చేసిన వరుణ్ తేజ్ ప్రస్తుతం వాల్మీకి చిత్రంలో నటిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహ్తున్నారు.

ఈ సినిమాతో పాటు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మరో మూవీకి వరుణ్ తేజ్ కమిటైనట్లు సమాచారం. కిరణ్ కొర్రపాటి ఇంతకు శ్రీను వైట్ల వద్ద పని చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ బాక్సర్ పాత్రలో కనిపించబోతున్నాడని, ఒలంపిక్ మెడల్ సాధించే లక్ష్యంతో కథ సాగుతుందని టాక్. వరుణ్ తేజ్ కెరీర్లో ఇదొక ప్రత్యేక మైన మూవీగా ఉంటుందని తెలుస్తోంది. 2020లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











