ఫోకస్ అంటోన్న మెగా ప్రిన్స్.. చేసి చేసి బాగా అలసిపోయినట్టున్నాడే!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ శైలియే వేరు. అది సినిమాల్లోనైనా సరే.. సోషల్ మీడియాలోనైనా సరే వరుణ్ తేజ్ ప్రత్యేకమే. ఈ లాక్ డౌన్ సమయంలో వరుణ్ తేజ్ తన వర్కౌట్లతో తెగ బిజీ అయిపోయాడు. తదుపరి ప్రాజెక్ట్ కోసం వరుణ్ తేజ్ ఫుల్ కష్టపడుతున్నాడు. ఇంట్లోనే బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ తెగ ప్రాక్టీస్ చేసేస్తున్నాడు. అయితే ప్రస్తుతం సాధారణ పరిస్థితికి వచ్చేలా కనిపించకపోవడంతో ఇంకా ఇంటి పట్టునే ఉంటున్నాడు.
లాక్ డౌన్‌కు ముందు వైజాగ్‌లో ఓ వారం రోజుల పాటు షూటింగ్ కూడా చేశారు. వైజాగ్ బీచ్ అందాలను, అక్కడి వాతావరణాన్ని తెగ ఎంజాయ్ చేసినట్టు వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఇంటి పట్టునే ఉంటున్న వరుణ్ తేజ్ బాక్సింగ్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాడు. తాజాగా మరో ఫోటోను వరుణ్ తేజ్ షేర్ చేశాడు. ఆ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వరుణ్ తేజ్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా.. బాగా అలిసి పోయినట్టున్నాడు. ఫోకస్ తప్పినట్టు కనిపిస్తోంది. అందుకే ఫోకస్ అంటూ వరుణ్ తేజ్ ఓ ఫోటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది. ఈ లాక్ డౌన్ సమయంలో వరుణ్ తేజ్ పోస్ట్‌లతోనై సెటైర్స్ వేస్తున్నాడు. ఆ మధ్య 2020 ఎలా ఉందో చెప్పుకుంటూ గతంలో దిగిన ఓ బ్లర్డ్ ఫోటోను షేర్ చేశాడు. ఈ మధ్య వరుణ్ తేజ్ నాగార్జున సిమెంట్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











