వెంకటేష్, రవితేజ హీరోలుగా.. మరో మల్టీస్టారర్ రెడీ అవుతోంది!
విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. సంక్రాంతికి విడుదలైన ఎఫ్2 చిత్రం దాదాపు 80 కోట్ల వసూళ్లు రాబట్టింది. వెంకటేష్ ప్రస్తుతం మల్టీస్టారర్ చిత్రాలకు టాలీవుడ్ లో బ్రాండ్ అంబాసిడర్ గా మారుతున్నాడు. ఎఫ్2 ఇచ్చిన ఉత్సాహంతో వెంకీ మరిన్ని మల్టీస్టారర్ చిత్రాలకు రెడీ అవుతున్నాడు. తాజగా క్రేజీ న్యూస్ ఒకటి వినిపిస్తోంది. విక్టరీ వెంకటేష్, మాస్ మహారాజ రవితేజ కలసి ఓ చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ క్రేజీ మల్టీస్టారర్ కు బిందాస్, ఈడు గోల్డ్ ఎహే చిత్రాల దర్శకుడు వీరు పోట్ల కథ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సంబందించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. చాలా కాలం తర్వాత వెంకటేష్ ఎఫ్2 చిత్రం ద్వారా తన మార్క్ కామెడీ పండించారని ప్రశంసలు దక్కాయి.

ప్రస్తుతం వెంకటేష్ వెంకీ మామ చిత్రంతో బిజీగా ఉన్నాడు. రవితేజ డిస్కోరాజా చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాలు పూర్తయిన తర్వాత వెంకీ, రవితేజ కల్సి నటించే చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఎఫ్2 చిత్రంలో వెంకీ, వరుణ్ తేజ్ కలసి నటించారు.


Click it and Unblock the Notifications











