వాళ్ల గురించి నాకు అనవసరం, వాటిగురించి బాధపడలేదు: వెంకటేష్
వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ 'ఎఫ్ 2' ఈ నెల 12న విడుదలవుతున్న నేపథ్యంలో వెంకటేష్ మీడియాతో మెచ్చటించి సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు తన కెరీర్ గురించి అంశాలను పంచుకున్నారు.
పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత జీవితాలు ఎలా ఉంటాయి అనేది 'ఎఫ్ 2' సినిమాలో ఉంటుంది. దర్శకుడు అనిల్ రావిపూడి కుటుంబ ప్రేక్షకులకు కావాల్సినంతన కామెడీ జోడించి సంక్రాంతి సందడికి తగిన విధంగా తెరకెక్కించారని తెలిపారు.

ఇమేజ్ గురించి నేను పట్టించుకోలేదు. అది నా చేతుల్లో ఉండే విషయం కాదు. నా సినిమాతో ప్రేక్షకులకు వినోదం అందుతుందా? లేదా? అనే విషయం మాత్రమే ఆలోచిస్తానని తెలిపారు. ఇతర హీరోలు ఏం చేస్తున్నారనేది నాకు అనవసరం, నా వద్దకు వచ్చిన కథలు నచ్చితే చేస్తానని వెంకటేష్ స్పష్టం చేశారు.
కొన్ని కారణాల వల్ల మన వద్దకు వచ్చిన సినిమాలు చేయలేక పోతాం. 'రోజా' సినిమా నేను చేయాల్సిందే..కానీ అపుడు చేతికి గాయం కావడం వల్ల చేయలేకపోయాను. మంచి సినిమా కొన్ని సార్లు చేజారిపోతాయి. అలాంటి వాటి గురించి ఎప్పుడూ బాధపడలేదని తెలిపారు.
తన తర్వాతి సినిమాల గురించి వెల్లడిస్తూ.. 'వెంకీ మామ'లో నేను, చైతు కలిసి చేయబోతున్నాం. ఇందులో ఇద్దరి పాత్రలు సమానంగా ఉంటాయి. దీంతో పాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒకటి ఉంటుంది. అనిల్ రావిపూడి కూడా మరో స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారని తెలిపారు.


Click it and Unblock the Notifications











