వాటిని ప్రేమించాల్సిన సమయం ఇదే.. వెంకటేష్ ఎమోషనల్ పోస్ట్
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. విరుగుడు లేని ఈ వైరస్ కారణంగా ఇప్పటికే లక్షల మంది మరణించారు. మన దేశంలోనూ దాదాపు 11 వేల మంది కరోనా బారినపడ్డారు. ఇంతలా వ్యాపిస్తోన్న కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.
కరోనా కట్డడికి దేశం మొత్తం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. మొదట 21 రోజుల పాటు ఉండగా.. నిన్నటి ప్రధాని ప్రకటనతో మరో 19 రోజుల అనగా మే 3 వరకు లాక్ డౌన్ పొడిగించారు. దీంతో ప్రజలంతా ఇంటి పట్టునే ఉండాలని ఆదేశించారు. అయితే ఇలాంటి సమయంలో ఫేక్ న్యూస్‌లు కూడా తెగ హల్చల్ చేస్తున్నాయి. మూగ జీవాల వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందని రూమర్స్ రావడంతో వాటి పరిస్థితి మరింత దిగజారిపోయింది.

తమ పెంపుడు జంతువులను వీధుల్లోనే వదిలేస్తుండటం లాంటి ఘటనలపై వెంకటేష్ స్పందించాడు. ఇలాంటి కష్టకాలంలో పెంపుడు జంతువులకు మన అవసరం ఉందన్నారు. ఇది కేవలం మనుషులకు మాత్రమే వచ్చిన కష్టం కాదని, భూమి మీద ఉన్న ప్రతి ప్రాణికి ఇది కష్ట సమయమేనని అన్నాడు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందనే అపోహల కారణంగా చాలా మంది తమ ఇంట్లో ఉన్న జంతువులను తరిమివేయడం దారుణమైన విషయమని పేర్కొన్నాడు. మనతో సమానమైన జంతువులను ప్రేమించాల్సిన సమయమిదేనని, లాక్‌డౌన్‌లో వాటికి సమయాన్ని కేటాయించండి అంటూ ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











