చూడగానే కన్ఫ్యూజ్ అయ్యా, టైమ్ పట్టింది.. వెంకటేష్!
సంక్రాంతికి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ఇప్పటి నుంచే ఆసక్తిరేపుతోంది. ప్రతి తెలుగువాడు చూడాలనుకునే చిత్రం ఇది అని చెప్పడంలో సందేహం లేదు. ఎన్టీఆర్ జీవితంలో కీలక సంఘటనలని ఈ చిత్రంలో ఎలా చూపించబోతున్నారనే ఉత్కంఠ ఎలాగూ ఉంది. ఎన్టీఆర్ పాత్రలో స్వయంగా బాలయ్య నటిస్తుండడం మరో విశేషం.
ఈ చిత్రంలో కీలక పాత్ర దారుల ఫస్ట్ లుక్స్ విడుదల చేస్తూ దర్శకుడు క్రిష్ సినిమాకి మంచి ప్రచారం చేస్తున్నాడు. ఈ చిత్రంలో లెజెండ్రీ ఏఎన్నార్ పాత్రలో హీరో సుమంత్ నటిస్తున్నాడు. ఏఎన్నార్ ఫస్ట్ లుక్ ని నిన్న విడుదల చేశారు. సుమంత్ ఏఎన్నార్ పాత్రలో ఒదిగిపోయాడని, ముఖ కవళికలు అచ్చు ఆయనలాగే ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రశంసలు అందాయి.

విక్టరీ వెంకటేష్ కూడా సుమంత్ ని ప్రశంసలతో ముంచెత్తాడు. ఆ ఫోటోలో ఉన్నది సుమంతా లేక నాగేశ్వరరావు గారా అని కొంత సమయం కన్ఫ్యూజ్ అయ్యానని వెంకీ తెలిపాడు. సుమంత్ అని గ్రహించడానికి కొంత సమయం పట్టిందని తెలిపాడు. ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు పాత్రలో రానా నటిస్తున్న సంగతి తెలిసిందే. రానా ఫస్ట్ లుక్ కూడా కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు.


Click it and Unblock the Notifications











