దుల్కర్ సల్మాన్, వెంకటేష్ మల్టీస్టారర్ చిత్రం!
తెలుగు రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రాలకు విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం కేంద్ర బిందువుగా మారాడు. వెంకీ నుంచే ఎక్కువ భాగం టాలీవుడ్ మల్టీస్టారర్ చిత్రాలు వస్తున్నాయి. మహేష్ తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పవన్ తో గోపాల గోపాల వంటి చిత్రాల్లో వెంకీ నటించాడు.
తాజగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ కు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, వెంకటేష్ హీరోలుగా యుద్ధ నేపథ్యంలో ఓ చిత్రం రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కథ ఆసక్తికరంగా ఉండడంతో వెంకటేష్ తన అంగీకారాన్ని తెలిపినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. వెంకీ ప్రస్తుతం వరుణ్ తేజ్ తో ఎఫ్ 2 అనే చిత్రంలో నటిస్తున్నాడు. యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.


Click it and Unblock the Notifications











