వెంకీ మామతో నాగ చైతన్య.. క్రేజీ మల్టీస్టారర్ ఎప్పటి నుంచి అంటే!
Recommended Video

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య నిజజీవితంలో మామ అల్లుళ్ళు. వీరిద్దరో వేడి తెరపై కూడా మామా అల్లుళ్లుగా కనిపించబోతున్నారు. వీరిద్దరూ హీరోలుగా వెంకీ మామ అనే టైటిల్ తో క్రేజీ మల్టీస్టారర్ చిత్రం రూపొందబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని దర్శకుడు బాబీ తెరకెక్కించబోతున్నాడు.
జైలవకుశ వంటి హిట్ చిత్రాన్ని రూపొందించిన బాబీ దర్శత్వంలో ఈ చిత్రం రాబోతుండడంతో మంచి ఆసక్తి నెలకొని ఉంది. మామ అల్లుళ్లుగా వెంకీ, చైతు ఎలాంటి అల్లరి చేస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. మంచి ఎంటర్ టైనింగ్ అంశాలతో ఈ చిత్రాన్ని బాబీ తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రం నవంబర్ రెండవ వారం నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

వెంకటేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ హ్యూమా క్యురేషి, చైతు సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సురేష్ ప్రొడక్షన్స్, కోనవెంకట్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ఈ చిత్రం రాబోతోంది.


Click it and Unblock the Notifications











