twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ డైరెక్టర్‌కి మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంకటేష్!

    |

    విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన చిత్రం ఎఫ్2. వెంకీ, వరుణ్ తేజ్ కలసి నటించిన ఈ క్రేజీ మల్టీస్టారర్ చిత్రం శనివారం జనవరి 12న ప్రేక్షలకుల ముందుకు రానుంది. అనిల్ రావిపూడి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. దిల్ రాజు నిర్మాతగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని రూపొందించారు. హాట్ బ్యూటీస్ తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించారు. భార్య భర్తల మధ్య గొడవ, భర్తలు అనుభవించే టార్చర్ లాంటి ఫన్నీ అంశాలతో అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

    ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో వెంకీ, వరుణ్ తేజ్ కలసి కామెడీతో రచ్చ చేస్తున్నారు. ఇక వెంకటేష్ అయితే నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి రోజులని మళ్ళీ గుర్తు చేసేలా నటిస్తున్నాడు. వెంకీ, వరుణ్ రచ్చ పూర్తి చిత్రంలో ఇంకెలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా వెంకటేష్ మరోమారు అనిల్ రావిపూడి దర్శత్వంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    Venkatesh one more movie with Anil Ravipudi

    ఎఫ్2 సమయంలోనే అనిల్ రావిపూడి వెంకటేష్ కు ఓ స్టోరీ లైన్ వినిపించాడట. పూర్తి కథ సిద్ధం చేయమని వెంకీ గ్రీన్ సింగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎఫ్2 తర్వాత వెంకీ.. వెంకీ మామ చిత్రంతో బిజీ కానున్నాడు. ఈ చిత్రం పూర్తయ్యాక వెంకీ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మరో చిత్రం ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

    English summary
    Venkatesh one more movie with Anil Ravipudi
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X