టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో బిగ్గెస్ట్ మల్టీస్టారర్.. వెంకటేష్ తో మొదటిసారి ఆ హీరో..
ఇటీవల కాలంలో కొత్త తరహా కథలు చేయడం చాలా కష్టంగా మారింది. దర్శకులు చాలా విభిన్నమైన కథలతో స్టార్ హీరోలను కలుస్తున్నప్పటికి కూడా కొందరు మాత్రం రీమేక్ సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. కోట్లల్లో పెట్టుబడి పెట్టె సినిమాలు కాబట్టి ఇతర భాషల్లో సక్సెస్ అయిన కథలను మళ్లీ మరొక భాషలో రీమేక్ చేయడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక దగ్గుబాటి ఫ్యామిలీ లో చాలా వరకు అలాంటి తరహా లోనే ఎక్కువ సినిమాలు వస్తూ ఉంటాయి.

కథ నచ్చితే..
నిర్మాత సురేష్ బాబు ఏదైనా కథ నచ్చితే వాటి రీమేక్ హక్కులను సొంతం చేసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. గతంలో చాలా వరకు వెంకటేష్ తో రీమేక్ సినిమాలు ఎక్కువగా చేశారు. దాదాపు ఆ సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి.

మలయాళం ప్రాజెక్ట్..
ఇక త్వరలోనే మరో మలయాళం సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకునేందుకు సురేష్ బాబు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మలయాళం లో ఇటీవల సక్సెస్ అయిన బ్రో దాడి ప్రాజెక్టును తెలుగు తెరపైకి తీసుకు రానున్నట్లు సమాచారం. వెంకటేష్ ఇప్పటికే నరప్ప దృశ్యం వంటి రీమేక్ సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. ఆ రెండు సినిమాలు కూడా డైరెక్టుగా ఓటీటీ లోనే విడుదలయ్యాయి.

భారీ డిమాండ్
ఇక ఇప్పుడు నిర్మాత సురేష్ బాబు మలయాళం హిట్ మూవీ బ్రో డాడీ అనే సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకునే విధంగా చర్చలు జరుపుతున్నట్లు గా ఒక టాక్ అయితే వస్తోంది. ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి ఇతర హీరోలు నిర్మాతలు దర్శకులు కూడా బాగానే ప్రయత్నాలు చేస్తున్నారు.

వెంకటేష్ - రానా..
మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ , మోహన్ లాల్ నటించిన బ్రో డాడీ సినిమా డైరెక్టుగా ఓటిటీలో విడుదలైంది. ఈ మలయాళం కామెడీ సినిమాకు టాక్ అయితే పాజిటివ్ గానే వచ్చింది. దీంతో ఇతర భాషల్లోకి కూడా రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక తెలుగు నుంచి నిర్మాత సురేష్ బాబు రీమేక్ హక్కులను సొంతం చేసుకునేందుకు ఇదివరకే మాట్లాడినట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమాకు పృథ్విరాజ్ దర్శకత్వం వహించాడు. ఒకవేళ సురేష్ బాబు హక్కులు సొంతం చేసుకుంటే వెంకటేష్ రానా దగ్గుబాటి లతో కలిసి సినిమాను రూపొందించే అవకాశం ఉందట ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ లో వెంకటేష్ రానా కలిసి ఒక ప్రాజెక్ట్ చేసేందుకు ఒప్పుకున్నారు..
Recommended Video

మొదలయ్యేది ఎప్పుడంటే..
ఇక బ్రో డాడీ సినిమా రీమేక్ లో నటించడానికి వెంకటేష్ రానా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రానా దగ్గుబాటి భీమ్లా నాయక్ సినిమాతో పాటు విరాటపర్వం సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక వెంకటేష్ నటించిన F3 సినిమా కూడా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. అలాగే వెంకటేష్ మరో రెండు సినిమాలను కూడా మొదలు పెట్టనున్నాడు. బ్రో డాడీ సినిమా డీల్ సెట్ అయితే ఇదే ఏడాది ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











