మా పెళ్లాలు రాలేదనే ఫ్రస్టేషన్లో ఉన్నాం: ‘ఎఫ్ 2’ ఆడియో వేడుకలో వెంకటేష్

విక్టరీ వెంకటేశ్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ హీరోలుగా తమన్నా, మెహరీన్‌ హీరోయిన్స్‌గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మించిన 'ఎఫ్‌ 2- ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌' ఆడియో రిలీజ్ వేడుక విశాఖపట్నంలో జరిగింది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన పాటలను ఆర్‌.కె.బీచ్‌లో జరిగిన విశాఖ ఉత్సవంలో విడుదల చేశారు. ఆడియో సీడీలను ఆంధ్రప్రదేశ్‌ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు విడుదల చేశారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇక్కడే మల్లీశ్వరితో బీచ్‌లో నడిచాను

ఇక్కడే మల్లీశ్వరితో బీచ్‌లో నడిచాను

విక్టరీ వెంకటేశ్‌ మాట్లాడుతూ... ''వైజాగ్ ఉత్సవాల్లో మా ఎఫ్ 2 సినిమా ఆడియో రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. నా ఫస్ట్ పిక్చర్ కలియుగ పాండవుల నుంచి ఎన్నో సినిమాలు ఇక్కడే చేశాను. స్వర్ణ కమలం, సుందరకాండ, గురు.. ఇదే బీచ్‌లో మల్లీశ్వరిలో మన కత్రినా కైఫ్‌తో అలా నడుకుంటూ వెళ్లాను. వైజాగ్ నాకు చాలా లక్కి.'' అని చెప్పుకొచ్చారు.

నన్ను మరింత రెచ్చిపోయి చేసేలా చేశాడు

నన్ను మరింత రెచ్చిపోయి చేసేలా చేశాడు

అనిల్ రావిపూడి నా గత చిత్రాలు జాగ్రత్తగా చూసి వాటికంటే రెచ్చిపోయేలా నాతో చేయించాడు. ఎఫ్-2 అనేది ఫన్ అండ్ ఫ్రస్టేషన్. ఈ సినిమాలకు పనిచేస్తున్న సమయంలో చాలా ఎంజాయ్‌ చేశాం. దేవిశ్రీ వండర్‌ఫుల్‌ మ్యూజిక్‌ ఇచ్చారని వెంకీ వ్యాఖ్యానించారు.

మా పెళ్లాలు రాలేదనే ప్రస్టేషన్ ఉంది

మా పెళ్లాలు రాలేదనే ప్రస్టేషన్ ఉంది

ఈ వేడుకకు అందరూ వచ్చారు.. కానీ పెళ్లాలు తమన్నా, మెహ్రీన్ రాలేదు. దాని వల్ల అందరం ఫ్రస్టేట్ అయినట్లు ఉన్నాం. దిల్‌రాజు, శిరీష్‌, లక్ష్మణ్ నాకు మంచి అవకాశం ఇచ్చారు. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత వారితో ఈ సినిమా చేస్తున్నానని తెలిపారు.

అపుడు మహేష్, ఇపుడు వరుణ్

అపుడు మహేష్, ఇపుడు వరుణ్

సీతమ్మ వాకిట్లో సినిమా ద్వారా నాకు మహేష్‌ లాంటి సోదరుడు దొరికాడు. ఇప్పుడు ఎఫ్‌2లో వరుణ్‌తేజ్‌లో మరో సోదరుడిని చూసుకుంటున్నాను. ఈ సినిమాకు పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు థాంక్స్‌.

బాలయ్య, రజనీ, చరణ్ సినిమాలు కూడా ఆడాలి

బాలయ్య, రజనీ, చరణ్ సినిమాలు కూడా ఆడాలి

జనవరి 12న ఎఫ్‌ 2 విడుదలవుతుంది. ఇదే సమయంలో బాలయ్యబాబు సినిమా, రజనీకాంత్‌గారి సినిమా, చరణ్‌ సినిమాలు విడుదలవుతున్నాయి. అందరి సినిమాలు బాగా ఆడాలి. తెలుగు ఇండస్ట్రీ బావుండాలని వెంకటేష్ ఆకాంక్షించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X