హీరో వెంకటేష్‌పై కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

వివాదాలకు, కాంట్రవర్సీలకు దూరంగా ఉండే హీరో విక్టరీ వెంకటేష్. కేవలం షూటింగ్ సమయాలలో మాత్రమే బయట కనిస్తాడు. ఎక్కువ ఫ్యామిలీకే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆయన వ్యక్తిగత జీవితం చాలా పర్సనల్ గా ఉంటుంది. ఎప్పుడు కూడా బయట పెట్టాడు. ఈవెంట్స్ లలో పార్టీలలో కూడా ఎక్కువగా పాల్గొనడు. వెంకటేష్ కేవలం సినిమాలు, ఫ్యామిలీ, రామానాయుడు స్టూడియో అన్నట్లుగానే వ్యవహరిస్తాడు. అలాగే తన పిల్లలు కూడా మీడియా కంట పడరు. మరో రెండు రోజులలో సంక్రాంతికి వస్తున్నామని సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అలాంటి సమయంలో విక్టరీ వెంకటేష్ పై కేసు నమోదు కావడం ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. ఇంతకీ వెంకటేష్ ఏం చేశాడు? దగ్గుబాటి ఫ్యామిలీ పై కేసు ఎందుకు నమోదయింది? వివరాల్లోకెళ్తే..

టాలీవుడ్ స్టార్ హీరో దగ్గుబాటి వెంకటేష్ తోపాటు సురేష్ బాబు,రాణాలపై కూడా కేసు నమోదు అయింది. ఫిలింనగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో కేసులో వీరిపై కేసు నమోదు చేయాల్సిందిగా నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఫిలింనగర్ పోలీసులు దగ్గుపాటి ఫ్యామిలీ పై కేసు నమోదు చేశారు. హైకోర్టు ఆగదేశాలను తిరస్కరిస్తూ .. దక్కన్ కిచెన్ హోటల్ ను కూల్చివేసినందుకు వారిపై కేసు నమోదైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు దగ్గుపాటి వెంకటేష్, నిర్మాత సురేష్ బాబు, నటుడు రాణా ,అభిరామ్ లపై శనివారం ఫిల్మ్ నగర్ పోలీసులు 448, 452,458,120 బి సెక్షన్లపై కేసు నమోదు చేసి ఎఫ్ ఐఆర్ నమోదుతో విచారణ చేపట్టారు.

Venkatesh Suresh Babu Rana Daggubati in legal trouble over land dispute

ఇంతకీ వివాదం ఏంటంటే..డెక్కన్ కిచెన్ ప్లీజ్ విషయంలో ఆ హోటల్ యజమాని నందకుమార్, దగ్గుపాటి ఫ్యామిలీ మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. వాస్తవానికి ఆ హోటల్ ఉన్న స్థలం వెంకటేష్ కు చెందింది. ప్లీజ్ విషయంలో వీరి మధ్య విభేదాలు రావడంతో.. హోటల్ యజమాని కోర్టును ఆశ్రయించాడు. లీజు విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని ధిక్కరించి అక్రమంగా బిల్డింగును కూల్చివేసారని పేర్కొన్నారు దీంతో తనకు 20 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోర్టు ను కోరారు. దీంతో దగ్గుపాటి వెంకటేష్ సురేష్ బాబు రానా అభిరాములపై కేసు నమోదయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X