వెంకీ, సూర్య మల్టీస్టారర్.. పోలీస్ ఆఫీసర్ పాత్రలో!
విక్టరీ వెంకటేష్ మల్టీస్టారర్ చిత్రాలపై దృష్టి పెట్టాడు. ఈ మధ్య కాలంలో వెంకీ వరుసగా మల్టీస్టారర్ చిత్రాల్లో నటిస్తున్నాడు. వరుణ్ తేజ్ తో ఓ మల్టి స్టారర్ చిత్రం, నాగ చైతన్యతో మరో చిత్రంలో వెంకటేష్ నటిస్తున్నాడు. మరో చిత్రానికి కూడా రంగం సిద్ధం అవుతోంది. ఈ చిత్రంలో వెంకటేష్, తమిళ స్టార్ హీరో సూర్య కలసి నటించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇది పూర్తి స్థాయి మల్టి స్టారర్ చిత్రం కాదని అంటున్నారు. సూర్య కేవలం ఈ చిత్రంలో 20 నిమిషాలు కనిపిస్తాడట. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సన్నివేశాల్లో సూర్య పాత్ర ఉంటుందని సమాచారం. వెంకటేష్ ఈ చిత్రంలో పోలీస్ అధికారిగా నటించనున్నాడు. దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది.

ఈ చిత్రాన్ని త్రినాథ్ రావు నక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న ఎఫ్2 చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. నాగ చైతన్య, వెంకీ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రానికి బాబీ దర్శకుడు.


Click it and Unblock the Notifications











