వెంకటేష్ 'దృశ్యం 2' పనైపోయింది.. ఈ స్పీడ్ ఏంటి స్వామి?
విక్టరీ వెంకటేష్ వయసు 60 అంటే నమ్మడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. నేటితరం హీరోలకు ధీటుగా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్న ఈ స్టార్ హీరో ఎలాంటి సినిమా చేసినా కూడా అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేస్తుంది. అందరికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు.. యాంటీ ఫ్యాన్స్ కూడా ఉంటారు. కానీ వెంకటేష్ ఒక్కడినే అందరూ ఇష్టపడతారు. అతనికి యాంటీ ఫ్యాన్స్ ఉండరు.
నెగిటివ్ కామెంట్స్ అందుకోకుండా చాలా పాజిటివ్ గా ఉండే ఈ సీనియర్ హీరో ఆరు పదుల వయసులో కూడా తీరిక లేకుండా కష్టపడుతున్నారు. ఒక సినిమా తరువాత మరొక సినిమాను జెట్ స్పీడ్ లో పూర్తి చేస్తున్నారు. ఇక ఇటీవల దృశ్యం 2ను కూడా వేగంగా పూర్తి చేశారు. మలయాళం హిట్ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఆ సినిమాను ఈ మద్యే స్టార్ట్ చేశారు.

ఇక రెండు నెలలు పూర్తి కాకముందే హీరో వెంకటేష్ తన సీన్స్ అన్నిటినీ కూడా పూర్తి చేసుకున్నాడు. ఇక దర్శకుడు జీతూ హోసెఫ్ మిగతా నటీనటులకు సంబంధించిన కొన్ని సీన్స్ ను పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఇంత వేగంగా పూర్తి చేయడం గ్రేట్ అనే చెప్పాలి. అలాగే F3 సినిమాను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఇటీవల ఒక కీలక షెడ్యూల్ ను మొదలు పెట్టారు.


Click it and Unblock the Notifications











