ఎన్టీఆర్‌తో సినిమా.. నాకింకా అనుభవం కావాలి!
యువ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన మిస్టర్ మజ్ను చిత్రం ఇటీవల విడుదలైంది. అఖిల్ మూడవ చిత్రంగా వచ్చిన మిస్టర్ మజ్నుకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్సే వస్తోంది. తొలి ప్రేమ చిత్రంతో వెంకీ అట్లూరి ప్రతిభగల దర్శకుడిగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. మిస్టర్ మజ్ను చిత్రం ఆడియో వేడుకకు హాజరైన ఎన్టీఆర్ వెంకీ అట్లూరిపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెంకీ అట్లూరి ఎన్టీఆర్ తో సినిమా గురించి మాట్లాడాడు. ప్రస్తుతం తాను మూడు కథలని సిద్ధం చేసుకుంటున్నాని తెలిపాడు. ఆడియో వేడుకలో ఎన్టీఆర్ తనని ప్రశంసించడం సంతోషంగా అనిపించింది. ఆయనతో సినిమా చేయాలనీ నాక్కూడా ఉంది. కానీ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో సినిమా అంటే అన్ని కుదరాలి. మంచి కథ సిద్ధం చేసుకోవాలి.

ముందుగా తాను ఇంకొంత అనుభవం సంపాదించుకోవాలి అని వెంకీ అట్లూరి తెలిపాడు. మరి కొన్ని రోజుల తర్వాత తన తదుపరి చిత్రం ఎవరితో ఉంటుందో వివరిస్తానని వెంకీ తెలిపాడు. తాను చిత్రాల్లో సంభాషణలకు, డైలాగులకు త్రివిక్రమ్ శ్రీనివాస్, మణిరత్నం స్ఫూర్తి అని వెంకీ అట్లూరి తెలిపాడు.


Click it and Unblock the Notifications











