నితిన్ కొత్త ప్రయత్నం.. బరువు తగ్గేలా!
యంగ్ హీరో నితిన్ ఇటీవల మూడు వరుస పరాజయాలు ఎదుర్కొన్నాడు. దీనితో తన తదుపరి చిత్రంపై నితిన్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాడు. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శత్వంలో నితిన్ నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తవుతోంది. ఈ చిత్రం గురించి దర్శకుడు వెంకీ కుడుముల ఓ ఆంగ్ల దినపత్రిక మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
ఈ చిత్రంలో నితిన్ ని సరికొత్త లుక్ లో చూయించబోతున్నానని తెలిపాడు. నితిన్ బాడీ లాంగ్వేజ్, హెయిర్ స్టైల్ ఈ చిత్రంతో పూర్తిగా మారిపోతాయని తెలిపాడు. ఇప్పటికే నితిన్ బరువు తగ్గేందుకు కసరత్తులు చేస్తున్నాడని కూడా వెంకీ వివరించాడు.

యాక్షన్, ఎమోషన్, లవ్ అన్ని అంశాలతో కూడుకున్న కమర్షియల్ చిత్రం రూపొందించబోతున్నట్లు వెంకీ తెలిపాడు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. కథ అద్భుతంగా వచ్చిందని వెంకీ తెలిపాడు. రష్మిక మందన ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించబోతోంది. ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని విశేషాలు త్వరలోనే తెలియనున్నాయి.


Click it and Unblock the Notifications











