వెనకడుగు వేసిన వెంకీ, అస్సలు తగ్గేది లేదంటోన్న నాగ్...

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను పాక్షికంగా సడలిస్తుండటంతో సినిమా షూటింగ్ లు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. తక్కువ బృందంతో షూటింగ్ లు ప్రారంభమవుతున్నాయి. సీరియళ్లు, చిన్న సినిమాల చిత్రీకరణ మొదలైనప్పటికీ, పెద్ద సినిమాలు మాత్రం ఇప్పట్లో సెట్స్ వైపు చూసే ఆలోచన చేయడంలేదు. ఇక సీనియర్ హీరోలైతే, ఈ ఏడాదికి రెస్ట్ తీసుకునే ఆలోచన కూడా చేస్తున్నారని వినికిడి.

షూటింగ్ సమయంలో భౌతిక దూరం పాటించాలి అన్న నిబంధనలతో షూటింగ్ లకు అనుమతులు లభించినప్పటికీ, దాన్ని అమలు చేయడం చాలా కష్టమైన పని తెలుస్తోంది. మేకప్ మాన్ ల దగ్గర నుంచి అందరితోనూ దగ్గరగా మెలగాల్సి ఉంటుందన్న భయంతో...మన సీనియర్ హీరోలు షూటింగ్ లకు దూరంగా ఉంటున్నారు. పైగా అందరికీ 60దాటేయడంతో కొద్ది రోజలు జాగ్రత్తగా ఉండటమే మేలని భావిస్తున్నారు.

Venky Steps back, As Nag gears up for Shooting

చిరంజీవి, బాలకృష్ణ, షూటింగ్ లకు విముఖత వ్యక్తం చేయగా, వెంకటేశ్ మరో అడుగు ముందుకేసి డిసెంబర్ వరకూ షూటింగ్ లో పాలుపంచుకోకూడదని ఫిక్స్ అయిపోయాడు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చిన తరువాతే నారప్ప షూటింగ్ మొదలుపెట్టే యోచనలో ఉన్నాడు. కానీ, వీరిందరికీ భిన్నంగా కింగ్ నాగార్జున మాత్రం, సై అంటూ బరిలోకి దిగుతున్నాడు.

బిగ్ బాస్ సీజన్ 4 మొదలవ్వుతుండటంతో నాగార్జున అన్ని భద్రతా చర్యల నడుమా షూటింగ్ మొదలుపెట్టబోతున్నాడు. త్వరోలోనే ఈ షోకు సంబంధించిన షూటింగ్ లో పాలుపంచుకోనున్నాడు. మరోవైపు ఎఫ్ 2 డైరెక్టర్ అనీల్ రావిపూడి కూడా నాగ్ సమయాన్ని పూర్తిగావినియోగించుకునేందుకు రెడీ అవుతున్నాడు. మరి, సీనియర్ హీరోల్లో డేరింగ్ స్టెప్ తీసుకున్న నాగ్, యంగ్ స్టర్స్ ను కూడా ఇన్స్పైర్ చేస్తాడేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X