జూ ఎన్టీఆర్ జాతకంలో సంచలన విషయాలు: భవిష్యత్తులో ఏం జరుగబోతోందంటే...?

By Bojja Kumar

Recommended Video

Venu Swamy Predictions On Jr.NTR Horoscope

నటులంటే ఫాలోయింగ్, గొప్ప అనుకుంటారు కానీ... వాళ్ల వ్యక్తిగత జీవితంలో ఎలాంటి ఘోరమైన పరిస్థితులు ఉంటాయో చెప్పడానికి జూ ఎన్టీఆర్ పరిస్థితి ఒక నిదర్శనమని ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి అన్నారు. తండ్రి చనిపోయిన మూడు రోజులకే ఆయన షూటింగులో పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడిందని, తండ్రి మరణంతో ఆయన భరించలేని ఆవేదనలో ఉన్నారని చెప్పిన ఆయన ఈ సందర్భంగా ఎన్టీఆర్ భవిష్యత్ ఎలా ఉంటుంది? ఆయన జాతకం ఏం చెబుతుందో యూట్యూబ్ ఛానల్ ద్వారా వివరించే ప్రయత్నం చేశారు.

ముఖ్యమంత్రి కాబోతున్నాడు

ముఖ్యమంత్రి కాబోతున్నాడు

జూ ఎన్టీఆర్ సింహ రాశి జాతకుడు. మే 20, 1983లో జన్మించారు. ఇప్పటి వరకు భారత దేశంలో ముఖ్యమంత్రులుగా పని చేసినటువంటి వ్యక్తులు, నటులు ముగ్గురే. ఎంజీఆర్, ఎన్టీ రామారావు, జయలలిత మాత్రమే. తర్వాత ఇప్పటి వరకు ఎవరూ లేరు. 2024 వరకు ఎవరూ రాక పోవచ్చు. ఈ ముగ్గురి తర్వాత ఒక ముఖ్యమంత్రి హోదాలో మనం చూడబోతున్న నటుడు, నాయకుడు జూ ఎన్టీఆర్ మాత్రమే అని వేణు స్వామి అన్నారు. అపుడు అందరూ ఆయన్ను ఇపుడు పిలిచినట్లు జూ ఎన్టీఆర్ అని పిలవరు. నందమూరి తారక రామారావు అని పిలుస్తారు అని తెలిపారు.

అప్పుడే రాజకీయాల్లోకి

అప్పుడే రాజకీయాల్లోకి

2022 నుంచి లేదా 2023 నుంచి జూ ఎన్టీఆర్ ప్రయాణం రాజకీయాల వైపు సాగే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీకి పూర్తి జవజీవాలు తీసుకొచ్చి కొత్త ఉత్తేజాన్ని తీసుకొచ్చి కచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో సీఎంగా నిలబడే జాతకం జూ ఎన్టీఆర్ జాతకం.

అందుకే ఇంత ఫాలోయింగ్

అందుకే ఇంత ఫాలోయింగ్

సప్తమాత రవి, కుజులు అనేది విపరీతమైన అభిమానుల ఫాలోయింగ్ ఇస్తారు. అందులోనే కాంట్రవర్సీలు ఉంటుంది. వంద మంది అభిమానుల్లో 50 మంది బయటకు వచ్చి మేము ఎన్టీఆర్ అభిమానులమని చెప్పుకుంటారు. మిగతా 50 మంది సమయం వచ్చినపుడు బయటకు వస్తారు. కారణం రవి కుజుల కాంబినేషన్.

ఇబ్బందులకు కారణం ఈ కాంబినేషనే

ఇబ్బందులకు కారణం ఈ కాంబినేషనే

శుక్రుడు, రాహువు కాంబినేషన్ కుటుంబ పరమైన ఇబ్బందులను సూచిస్తుంది. ఆయన వ్యక్తిగతమైన జీవితంలో ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. వాటి గురించి ఇపుడు ప్రత్యేకంగా చెప్పడం భావ్యం కాదు. ఇక్కడ పొలిటికల్ లైఫ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను.

రాజయోగం ఉంది

రాజయోగం ఉంది

జూ ఎన్టీఆర్ జాతకంలో అనుకోకుండా రాజయోగం అనేది కనిపిస్తుంది. కారణం శుక్రుడు, రాహువు కాంబినేషన్. ఎవరూ ఊహించని సందర్భంలో ఆయన సడెన్ గా పీఠం మీదకు వచ్చి ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడి... ముఖ్యమంత్రి యోగాన్ని, పీఠాన్ని అధిరోహించే అవకాశం జూ ఎన్టీఆర్ జాతకంలో కనిపిస్తోంది.

గండాల నుండి బయట పడాలంటే

గండాల నుండి బయట పడాలంటే

హరికృష్ణ గారి తరంలో మాత్రమే తీసుకుంటే.... హరికృష్ణగారు, జానకి రామ్ గారు, ఎన్టీఆర్ జాతకాలను విశ్లేషిస్తే జరుగుతున్న సంఘటనల నుండి బయట పడటానికి దురదృష్టకరమైన వాహన ప్రమాదాల నుండి బయట పడటానికి ఒక కార్యక్రమాన్ని ఎన్టీఆర్ ఆధ్వర్యంలో వారి కుటుంబంలో చేయాలి. అది చేసుకున్న తర్వాత వ్యక్తిగతమైన ప్రమాదాలు, గండాల నుండి వారు పూర్తిగా బయటపడే అవకాశం ఉంది.

అవే పరిస్థితులు ఎన్టీఆర్ జాతకంలో

అవే పరిస్థితులు ఎన్టీఆర్ జాతకంలో

నేను పార్టీలకు, ప్రాంతాలకు అతీతం.... రాబోయే కాలంలో 2024 తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఓ బలమైన శక్తిగా ఎదిగే అవకాశం ఉంది. ఎన్టీఆర్ అపుడు రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఆయన ద్వారా కచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనిపిస్తోంది. కారణం ఆయన జాతకం జయలలిత గారి జాతకానికి దగ్గరగా ఉండటమే. మరీ విచిత్రంగా పెద్ద ఎన్టీఆర్ జాతకంలో ఎలాంటి లగ్నాతి పరిస్థితులు ఉన్నాయో అలాంటివే ఎన్టీఆర్ జాతకంలో ఉన్నాయి.

కానీ ఓ చిన్న సమస్య ఉంది

కానీ ఓ చిన్న సమస్య ఉంది

మనం పరిశీలించినట్లయితే ఆ హావభావాలు, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ తేజస్సు పెద్ద ఎన్టీఆర్ ద్వారా చిన్న ఎన్టీఆర్ రూపంలో కనిపిస్తాయి. ఆయన జిరాక్స్ కాపీలాగ బయటకు వచ్చాయి. చిన్న ఎన్టీఆర్ జాతకంలో ఉన్న ఒకే ఒక సమస్య.... బోన్స్, స్పైనల్ కార్డ్ విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. వాక్ శుద్ధి అనేది జాగ్రత్తగా ఉండాలి. త్వరపడే మనస్తత్వం ఆపుకుని, ఆచి తూచి మాట్లాడటం జరిగితే రాజకీయంగా ఉన్నతమైన శిఖరాలను అధిరోహించే అవకాశం ఉంది.

నూటికి కోటిశాతం సీఎం అవుతాడు

నూటికి కోటిశాతం సీఎం అవుతాడు

రవి, కుజుడు ఉచ్ఛస్థితిలో ఉన్నారు కాబట్టి తప్పకుండా భూమి మీద ఆధిపత్యం, కుజుడు భూమి మీద ఆధిపత్యంగా ఉంది. మార్చి 27వ తేదీ, 2009వ సంవత్సరంలో జరిగిన వాహన ప్రమాదం నుండి బయట పడటానికి ఒక భారీ కారణం ఉంది. పెద్ద ఎన్టీఆర్ జాతకంలో కూడా హరికృష్ణ గారు డ్రైవింగ్ చేస్తున్నపుడు ఒక వాహన ప్రమాదం సంభవించింది. దాని తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. చిన్న ఎన్టీఆర్ జాతకంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు నూటికి కోటి శాతం ఉంది అని వేణు స్వామి తేల్చి చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X