త్రివిక్రమ్ అతడు సినిమాలో అవకాశం వచ్చింది.. ఎందుకు చేయలేదంటే: వేణు తొట్టెంపూడి

స్వయవరం అనే సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన డీసెంట్ నటుడు వేణు తొట్టెంపూడి ఆ తర్వాత లవ్ స్టోరీస్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. కొన్నాళ్ళ వరకు ఇండస్ట్రీలో బాగానే బిజీ గా కనిపించిన వేణు కమర్షియల్ గా మంచి సక్సెస్ కూడా అందుకున్నాడు. ముఖ్యంగా అతని కెరీర్లో హనుమాన్ జంక్షన్ అనే సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.

గెలుపు ఓటములతో సంబంధం లేకుండా కొంతకాలం పాటు టాలీవుడ్లో బిజీగా కనిపించిన వేణు తొట్టెంపూడి కొంతమంది కొత్త దర్శకులకు కూడా అవకాశాలు ఇచ్చారు. అయితే ఒకవిధంగా ఆయన తన మంచితనం కారణంగానే కొంతమంది ని నమ్మడం వలన మంచి అవకాశాలు కూడా పోగొట్టుకున్నట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ వేణు స్వయవరం సినిమాతో తన కెరీర్ ని మొదలు పెట్టాడు. అయితే చాలా సమయాల్లో కొన్నిసార్లు త్రివిక్రమ్ కూడా తన ప్రాజెక్టులకు సంబంధించి సహాయం కూడా అడిగినట్లు తెలియజేశాడు.

Venu thottempudi about Trivikram srinivas offered supporting role in athadu movie

అయితే కారణం ఏమిటో గాని త్రివిక్రమ్ మాత్రం అప్పుడు తన తో సినిమా చేసే ఆసక్తి లో కనిపించలేదు అని వివరణ ఇచ్చారు. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక సమయంలో నన్ను అతడు సినిమా కోసం కూడా సంప్రదించాడు అంటూ అందులో సోనూసూద్ చేయాల్సిన క్యారెక్టర్ నేను చేయాల్సింది. కానీ ఆ సమయంలో హీరోగా చేసి మళ్ళీ అలాంటి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చేయడం అంత కరెక్ట్ కాదు అనిపించింది.

ఒక ప్రముఖ సినిమా ఎడిటర్ కూడా ఆ విషయంలో సలహా ఇచ్చారు. అతను కూడా చేయవద్దు అని చెప్పారని వేణు తొట్టెంపూడి తెలియజేశారు. ఇక ఆ పాత్ర చేసి ఉంటే బహుశా నా కెరీర్ వేరే విధంగా ఉండేదేమో అని వేణు తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. ఆ తర్వాత చాలా వరకు కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ కూడా సినిమాల మీద పెద్దగా ఆసక్తి లేక పోవడంతో చేయలేదు అని ఈ సీనియర్ నటుడు వివరణ ఇచ్చాడు. ఇక ఇటీవల రామారావు ఆన్ డ్యూటీ సినిమా లో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన వేణు బాగానే నటించినప్పటికీ అతని పాత్రను పెద్దగా వాడుకోలేదని ప్రేక్షకుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X