బాలకృష్ణతో చేతులు కలిపిన జూ.ఎన్టీఆర్ బావ.. మొన్నటి వరకు టీడీపీకి సేవ.. ఇప్పుడేమో ఇలా!

By Manoj

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూకుడు ప్రదర్శిస్తున్నాడు నటసింహా నందమూరి బాలకృష్ణ. పేరుకు సీనియర్ హీరోనే అయినా కుర్రాళ్లకు పోటీగా రాణించేందుకు తెగ కష్ట పడుతున్నాడు. ఈ క్రమంలోనే సినిమా సినిమాకూ సరికొత్త ప్రయోగాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ బావ కీలక పాత్ర చేస్తున్నట్లు తాజాగా ఓ వార్త లీక్ అయింది. మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీకి సేవ చేసిన ఆయన.. ఇప్పుడు బాలయ్యతో కలిశాడు. ఇంతకీ ఎవరా హీరో.? పూర్తి వివరాల్లోకి వెళితే...

నందమూరి హీరోకు నష్టాలు మిగిల్చింది

నందమూరి హీరోకు నష్టాలు మిగిల్చింది

నందమూరి బాలకృష్ణకు 2019వ సంవత్సరం అస్సలు కలిసి రాలేదు. పోయిన ఏడాది ఆయన మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా.. అవన్నీ ఘోరంగా పరాజయం పాలయ్యాయి. వీటిలో తన తండ్రి నందమూరి తారక రామారావు బయోపిక్‌గా వచ్చిన ‘యన్.టి.ఆర్' రెండు భాగాలకు ఆయన నిర్మాతగానూ వ్యవహిరించారు. దీంతో భారీగా నష్టాలు కూడా వచ్చాయి.

కలిసొచ్చిన డైరెక్టర్‌తో మరోసారి కలిశాడు

కలిసొచ్చిన డైరెక్టర్‌తో మరోసారి కలిశాడు

గతంలో ‘సింహా', ‘లెజెండ్' వంటి రెండు సూపర్ హిట్ చిత్రాలను అందించిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో నందమూరి బాలకృష్ణ మరోసారి కలిశారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాను కొద్ది రోజుల క్రితం ప్రారంభించారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ కూడా పూర్తయింది. అయితే, ఈ చిత్రానికి హీరోయిన్‌ ఎంపిక మాత్రం ఇంకా పూర్తి కాలేదు.

ఇప్పటి వరకు చూడని పాత్రలో బాలయ్య

ఇప్పటి వరకు చూడని పాత్రలో బాలయ్య

రెండు భారీ విజయాల తర్వాత బాలయ్య - బోయపాటి కాంబినేషన్‌లో సినిమా వస్తుండడంతో దీనిపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. వాటికి అనుగుణంగానే సినిమా చిత్రీకరణ కూడా జరుగుతుందని సదరు డైరెక్టర్ ఇటీవల ప్రకటించాడు. అంతేకాదు, ఇందులో నటసింహా.. వారణాశి పరిసర ప్రాంతాల్లో జీవించే అఘోరాలా కనిపించబోతున్నాడని కూడా రివీల్ చేసేశాడాయన.

క్లారిటీ రాలేదు.. ఆ హీరో మాత్రం ప్రకటించాడు

క్లారిటీ రాలేదు.. ఆ హీరో మాత్రం ప్రకటించాడు


ఈ సినిమాలో ఎవరు నటిస్తున్నారన్న దానిపై ఇప్పటి వరకు చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి ప్రకటనా రాలేదు. కానీ, పలానా వాళ్లు నటిస్తున్నారని తరచూ ఏదో ఒక వార్త బయటకు వస్తోంది. ఇందులో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' హీరో నవీన్ పోలిశెట్టి నటిస్తున్నాడని ఈ మధ్యనే ఓ వార్త తెరపైకి వచ్చింది. ఆ వెంటనే దీన్ని ఖండిస్తూ సదరు హీరో ప్రకటన విడుదల చేశాడు.

బాలకృష్ణ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ బావ

బాలకృష్ణ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ బావ


ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. దీని ప్రకారం.. గతంలో బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘దమ్ము'లో తారక్ బావగా నటించిన వేణు తొట్టెంపూడి కీలక పాత్రను పోషిస్తున్నాడట. బాలయ్య పక్కనే ఉండి సినిమా మొత్తం ట్రావెల్ చేసే ఆ రోల్‌ ఎంతో కీలకమైనది అని సమాచారం.

Recommended Video

Tollywood And Bollywood Celebrities Participated in Modi's 9 PM 9 Baje Light Lamps event
మొన్నటి వరకు టీడీపీకి సేవ.. ఇప్పుడిలా.!

మొన్నటి వరకు టీడీపీకి సేవ.. ఇప్పుడిలా.!


‘స్వయంవరం' సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయం అయ్యాడు వేణు తొట్టెంపూడి. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి బిజీ హీరో అయిపోయాడు. తన బంధువు అయిన నామా నాగేశ్వర్రావు (ప్రస్తుత ఖమ్మం ఎంపీ) కోసం తెలుగుదేశం పార్టీ తరపున పలుమార్లు ప్రచారం కూడా నిర్వహించాడు. బాలయ్య సినిమా కోసం లాంగ్ గ్యాప్ తర్వాత మేకప్ వేసుకోబోతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X