నితిన్, శర్వానంద్ నో.. పీరియాడిక్ డ్రామాకు ఒకే చెప్పిన రానా!
కొత్త కథలతో సినిమా చేయాలంటే దర్శకులకు దగ్గుబాటి రానా మొదటి ఛాయిస్ అవుతున్నాడు. బాహుబలిలో విలన్ గా నటించినా, ఘాజి లాంటి విభిన్న చిత్రంలో నటించినా, నేనే రాజు నేనే మంత్రి లాంటి పొలిటికల్ డ్రామాతో ఆకట్టుకున్నా అది రానాకు మాత్రమే చెల్లింది. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయి నటించడం రానా ప్రత్యేకత. ఇదిలా ఉండగా రానా మరో డిఫెరెంట్ మూవీకి పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది.
నీది నాది ఒకే కథ చిత్రంతో వేణు ఊడుగుల దర్శకుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. తన రెండవ చిత్రం కోసం ఓ పీరియాడిక్ డ్రామాని వేణు సిద్ధం చేసుకున్నాడు. ఈ చిత్రానికి నాని, శర్వానంద్, నితిన్ లాంటి హీరోలు నో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ రానా ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. స్వతహాగా విభిన్న కథలని ఇష్టపడే రానాకు వేణు చెప్పిక స్టోరీ నచ్చిందట. 40 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి విరాటపర్వం 1992 అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

మరో క్రేజీ న్యూస్ ఏంటంటే ఈ చిత్రంలో రానాకు జోడిగా సాయిపల్లవి నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంపై మరిన్ని వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు రానా 200 కోట్ల బడ్జెట్ లో హిరణ్యకశిప చిత్రానికి సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకతం వహించబోతున్నారు.


Click it and Unblock the Notifications











